
అండమాన్ నికోబార్ దీవుల్లో స్వల్ప భూకంపం
అండమాన్ నికోబార్ దీవుల్లో గురువారం రాత్రి స్వల్ప భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్పై 5.1గా నమోదు అయింది.
పోర్ట్బ్లెయిర్ : అండమాన్ నికోబార్ దీవుల్లో గురువారం రాత్రి స్వల్ప భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్పై 5.1గా నమోదు అయింది. ఈ మేరకు యూఎస్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. పోర్ట్బ్లెయిర్కి 241 కిలోమీటర్ల దూరంలోని బ్యాంబూ ప్లాట్ సమీపంలో భూకంప కేంద్రాన్ని కనుగొన్నట్లు తెలిపింది. అయితే ఎక్కడ ఆస్తి, ప్రాణ నష్టం కానీ సంభవించినట్లు సమాచారం అందలేదని పేర్కొంది.