పోర్టుబ్లేయర్ : అండమాన్ నికోబార్ ద్వీపంలో భూకంపం సంభవించింది. నికోబార్ ద్వీపంలో బుధవారం ఉదయం 1.51 గంటలో సమయంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. అండమాన్ ద్వీపంలో 10 కిలోమీటర్ల లోతున ఏర్పడిన ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.5గా నమోదయ్యింది. దీంతోపాటు చెన్నై, తమిళనాడులోని మరికొన్ని ప్రాంతాల్లో కూడా భూమి కంపించినట్లు ఐఎండీ అధికారులు తెలిపారు. బంగాళఖాతం తీర ప్రాంతంలో ఏర్పడిన ఈ భూకంపం వల్ల ఎటువంటి ఆస్తి, ప్రాణ నష్టం కలగలేదని అధికారులు వెల్లడించారు.
Earthquake of Magnitude:4.5, Occurred on:13-02-2019, 01:51:30 IST, Lat:13.9 N & Long: 91.4 E, Depth: 10 Km, Region:Andaman Islands Region pic.twitter.com/6zwWyfE7DC
— India Met. Dept. (@Indiametdept) February 12, 2019
అయితే ఈ నెల 10న ఇండియా-మయన్మార్ సరిహద్దులో, అరుణాచల్ ప్రదేశ్ ప్రాంతంలో కూడా భూకంపం సంభంవించిన సంగతి తెలిసిందే. దీని తీవ్రత రిక్టర్ స్కేల్ మీద 5.2గా నమోదయ్యింది.
Comments
Please login to add a commentAdd a comment