పపువా న్యూగినియాలో మరోసారి భూకంపం సంభవించింది. ఈ భూప్రకంపనల తీవ్రత 7.0గా నమోదు అయ్యింది.
సిడ్నీ: పపువా న్యూగినియాలో మరోసారి భూకంపం సంభవించింది. ఈ భూప్రకంపనల తీవ్రత 7.0గా నమోదు అయ్యింది. దీని ప్రభావంతో అక్కడి సముద్ర తీరం ప్రకంపనలతో వణికిపోయింది. అలలతో పోటెత్తింది. కాగా ఆస్తినష్టం, ప్రాణనష్టంపై ఎలాంటి సమాచారం లేదు. మే 1వ తేదీన కూడా న్యూగినియాలో భూకంపం సంభవించిన విషయం తెలిసిందే.