అండమాన్ నికోబార్ దీవులను 8 భూకంపాలు వణికించాయి. వీటిలో రెండు భారీ భూకంపాలు కూడా ఉన్నాయి. ఆదివారం రాత్రి సమయంలో ఇవి వచ్చాయి. భారీ భూకంపాల తీవ్రత రిక్టర్ స్కేలుపై 5కు పైగా నమోదైంది. అయితే దీనివల్ల సునామీ ముప్పు మాత్రం ఏమీ లేదు. మరోవైపు.. ఇండోనేషియాలోని ఉత్తర సుమత్రా దీవుల్లో కూడా రిక్టర్ స్కేలుపై 5.7 తీవ్రతతో మరో భూకంపం భూమికి పది కిలోమీటర్ల లోతున సంభవించింది.
అండమాన్ నికోబార్ దీవుల్లో సంభవించిన భూకంపాలన్నీ భూమికి 35-60 కిలోమీటర్ల లోతున నమోదయ్యాయి. గతంలో కూడా అండమాన్ నికోబార్ దీవుల్లో పలుమార్లు భారీ భూకంపాలు సంభవించాయి. ఈ ప్రాంతంతో పాటు ఇండోనేషియాలో కూడా భూకంపాలు సంభవించే అవకాశాలు ఎక్కువని శాస్త్రవేత్తలు చెబుతుంటారు.
అండమాన్ నికోబార్ దీవుల్లో 8 భూకంపాలు
Published Mon, Nov 9 2015 8:23 AM | Last Updated on Fri, Jun 1 2018 9:35 PM
Advertisement
Advertisement