ఆదిమ ఏకాంతం ఎన్నాళ్లు?
విశ్లేషణ
అండమాన్‌లోని జరావా తెగ ప్రజల నిర్బంధ ఏకాంత వాసాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. కానీ వారికి తమ మనుగడ విషయంలో తమదైన అవకాశం, ఎంపిక ఉందా? లేదా?
ఇటీవల అండమాన్ జరావా తెగకు వార్తా పత్రికల్లో కాస్త చోటు లభ్యమవుతున్నట్లు కనిపిస్తోంది. జరావా యేతర పురుషుడితో సంపర్కం ద్వారా ఈ తెగ మహిళ ఒక పాపను ప్రసవించింది. అయితే ఆ పాప హత్యకు గురైంది. ఈ హత్యను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవాలా? లేక, జరావా తెగ అంతరించి పోకుండా కాపాడాలన్న తాను తీసుకున్న నిర్ణయం కారణంగా ఆ హత్యోదంతాన్ని పట్టించుకోకుండా ఉండిపోవాలా? శిక్షించడం ద్వారా ఒక జరావాను కోల్పోయినట్లయితే అది వారి సంఖ్యను తగ్గించే అవకాశముంది. ఒక్క మనిషి తగ్గిపోయినా సరే వారి సంఖ్య తగ్గిపోతుంది.
దాదాపు 50 వేల సంవత్సరాలుగా జరా వాలు అండమాన్ ప్రాంతంలో వేటతో ఆహా రాన్ని సేకరించుకునేవారుగా మనుగడ సాధిస్తు న్నారు. క్షీణిస్తున్న వారి సంఖ్య రీత్యా అండమాన్ లోని ఓంజె తెగలాగా వీరినీ రక్షిత జాబితాలోకి చేర్చారు. వారి విశిష్ట, ప్రత్యేక లక్షణాల కారణం గా ఏ ఇతర గుంపులో కలిసినా సరే వీరికి హాని కలిగే అవకాశముంది. అందుకే, ‘బయటి వ్యక్తుల కనీస జోక్యం’తో ‘తమదైన భవిష్యత్తును ఎంచుకోవడానికి’ జరావాలను అనుమతించి నట్లు సర్వైవల్ ఇంటర్నేషనల్ పేర్కొంది.
జరావాలను వారి ఆవాస ప్రాంతాల్లోనే ఉంచుతూ వాటి సరిహద్దుల్లో గార్డులను నియమించడం ద్వారా వారిని బయటి వ్యక్తుల కు దూరంగా ఉంచడం అనేది ప్రభుత్వం అనుసరించే విధానపు ముఖ్య లక్షణంగా ఉంటోంది. ఒక దశలో సుప్రీంకోర్టు సైతం జరావాలు నివసించే ప్రాంతం గుండా వెళ్లే రోడ్‌ను సైతం నిలిపివేయాలని ఆదేశించింది. గిర్ జంతు సంరక్షక కేంద్రంలోని సింహాలను చూస్తున్న విధంగా బయటి వ్యక్తులు జరావా లను చూడటానికి సఫారీకి వెళుతున్నారు.
వారెక్కడ ఉంటున్నారో అక్కడే అలాగే ఉండేవిధంగా, జరావాలకు ప్రభుత్వం కలిగిస్తున్న రక్షణ నిష్క్రియాత్మకంగానే ఉంది. 1990ల ప్రాంతంలో జరావాలు అడవుల నుంచి బయటకు వచ్చి, తమ తెగ కానివారితో, బయటివారితో సంబంధాలు పెట్టుకోవడం ప్రారంభించారు. దేశంలోని ఇతర తెగలను ప్రధాన స్రవంతిలో కలిపేందుకోసం సక్రియాత్మకమైన, నిర్ణయాత్మకమైన మద్దతు నిచ్చేవారు. వీరికి కోటాలు ఉండేవి. బడ్జెట్లు ఉండేవి. అన్ని ప్రజాప్రాతినిధ్య సంస్థల్లో ప్రాతినిధ్యం కూడా ఉండే ది.
మరొకవైపున, జరావాలను నిర్బంధ ఒంటరితనంలో ఉండేలా ప్రోత్సహిస్తున్నారు. అధికారిక విధానం ప్రకారం జరావాలను సంరక్షిస్తున్నారు. వారి రక్తసంబంధాన్ని, సంస్కృతిని భద్రపర్చడానికి మానవ విజ్ఞాన శాస్త్ర రీత్యా తగు కారణాలు ఉండవచ్చు.. కానీ వారికి మనుగడ విషయంలో తమదైన అవకాశం, ఎంపిక ఉందా? వారు ఏం ఎంపిక చేసుకునేది ఏది? మనకేమీ తేలీదు. ఎందుకంటే అలాంటి అవకాశాన్ని, ఎంపికను మనం అసలు కనుగొనలేదు. అలాంటి అవకాశం వారికి ఉంటే, పార్సీలుగా ప్రధాన స్రవంతిలో ఉంటూనే తమ విశిష్ట లక్షణాలను అలాగే నిలిపి ఉంచుకునేవారా?
ఇతరులతో పోలిస్తే తాము విశిష్టత కలిగి ఉన్నామనే విషయం పట్ల వారు జాగరూకతతో ఉంటున్నారని, కొత్తగా పుట్టిన బిడ్డను ఒక జరావా తెగ వ్యక్తి చంపివేసిన ఘటన సూచిస్తోంది. రహస్య సంబంధం వారిని మశూచి బారిన పడవేస్తున్నందున, వారిని బహిర్గతం చేసినట్లయితే తెగమొత్తానికే నష్టం కలుగుతుందని మనం గ్రహిస్తున్నాం. తక్కిన ప్రపంచం నుంచి పూర్తిగా దూరం పెట్టినందుకే వారిపట్ల ఆసక్తి ఏర్పడుతోందా?
వారు మన ప్రపంచాన్ని అర్థం చేసుకోలేదని చాలా తక్కువగానే వారికి తెలుసనేది స్పష్టం. మనలో ప్రతి ఒక్కరికీ దఖలుపడిన హక్కుల గురించి కూడా వారికి తెలిసింది చాలా తక్కువే. విచిత్రం ఏమిటంటే, వారిని రంగంలో ఉంచేందుకోవడమే? మనం సమయాన్ని, శక్తిని, వనరులనూ వెచ్చిస్తున్నాం. ఇది ఊరగాయల సీసాలో ముక్కల్లాగే తలపిస్తుంది. స్పష్టంగా చెప్పాలంటే వారి తరపున మనం నిర్ణయాలు తీసుకోవడమే అన్యాయం, అసమంజసం. మన గణతంత్ర రాజ్యంలో వారు భాగంగా లేరనిపించేలా ఇది ఉంటోంది.
జరావాలను ఉన్నట్లుండి ప్రపంచం ముందుకు తీసుకురావటం వల్ల సొంత ప్రయోజనాలున్న బయటివారు వారికి పూర్తిగా హాని కలిగించేలా చేస్తుంది. సొంత ప్రయోజనాలు అంటే జరావాలు ఆధారపడి ఉన్న అడవులు లేదా వారి ఓట్లు వంటివి. వీటిలో రెండోదానికి అంత ప్రాముఖ్యత ఉండక పోవచ్చు. ఎందుకంటే జరావాల మొత్తం సంఖ్య 300 లేక 400 మాత్రమే. అయితే తక్కిన భారత్‌తో పోలిస్తే తమ పరిస్థితి గురించి అర్థం చేసుకోవడంలో వారికి సహాయం చేసే స్థాయిలో వారికి విద్య గరిపే విషయంలో కూడా ఎలాంటి గట్టి ప్రయత్నం జరిగి ఉండలేదు.
వారి సమ్మతితో పనిలేకుండా మనం నిర్ణయిస్తున్నాం కాబట్టి నేను నైతిక ప్రశ్నను లేవనెత్తుతున్నాను. కానీ అత్యంత చిన్న స్థాయి లోని వారి పరిమాణం రీత్యా వారు ఇప్పటికే మనల్ని ఉనికిపరంగా భయపెడుతున్న సామా జిక బృందంగా ఉంటున్నారు. ఏరకంగా చూసిన ప్పటికీ వారి భవిష్యత్తు అనిశ్చితంగానే ఉంది. అయినప్పటికీ ప్రస్తుత విధానం ప్రకారం వారు తమదైన చిన్న ప్రాంతానికి పరిమితమై ఉండాల్సిందే.
- మహేష్ విజాపుర్కార్
వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు
ఈమెయిల్: mvijapurkar@gmail.com