కన్నీటి ‘కడలి’ | Andaman: 31 dead as tourist boat capsizes | Sakshi
Sakshi News home page

కన్నీటి ‘కడలి’

Published Tue, Jan 28 2014 2:17 AM | Last Updated on Fri, Jun 1 2018 9:35 PM

Andaman: 31 dead as tourist boat capsizes

 గణతంత్ర దినోత్సవం రోజు విహారయాత్రకు బయలుదేరిన తమిళవాసులను కడలి మింగేసింది. అండమాన్ దీవుల్లో పడవ బోల్తా పడిన సంఘటనలో 31 మంది మృత్యువాత పడగా, వారిలో 19 మంది తమిళులే కావడంతో రాష్ర్టం శోకసంద్రంలో మునిగిపోయింది. 
 
 చెన్నై, సాక్షి ప్రతినిధి:అధిక లోడ్‌తో వెళుతున్న పడవ బోల్తాపడి 31 మంది ప్రాణాలు కోల్పోయిన సంఘటన గణతంత్ర దినోత్సవం రోజు అండమాన్ దీవుల్లో చోటుచేసుకుంది. ఇందులో తమిళనాడువాసులు 19 మంది ఉన్నారు. కాంచీపురం కూరం గ్రామానికి చెందిన కే సెల్వరాజ్ పూజాట్రావెల్స్ పేరుతో విదేశీ యాత్రలు నిర్వహిస్తుంటారు. ఈనెల 26వ తేదీ రిపబ్లిక్ డే కావడంతో చెన్నై, కంచికి చెందిన 32 మందితో అండమాన్ టూర్ వేశారు. వీరిలో 16 మంది పురుషులు, 13 మంది స్త్రీలు, ముగ్గురు బాలికలు ఉన్నారు. విమానంలో వీరందరూ అండమాన్‌కు చేరిన అనంతరం సముద్ర విహారానికి 25 మంది సామర్థ్యం కలిగిన పడవలోకి మహారాష్ట్రకు చెందిన వారు కూడా కలిసి 46 మంది ఎక్కారు. 
 
 ఆదివా రం సాయంత్రం వీరంతా నడిసముద్రంలో ప్రయాణిస్తుండగా ఎగిసిపడిన అలలతో కుదుపులకు లోనైన పడవ ఒరిగిపోయింది. దీంతో పడవలోని 31 మంది నీటమునిగి ప్రాణాలు కోల్పోయూరు. వీరిలో 19 మంది తమిళనాడు చెందినవారు ఉన్నారు. ముగ్గురు గల్లంతైనట్లు సమాచారం. స్వల్పంగా గాయపడిన వారికి ప్రథమ చికిత్స చేసి పంపించేశారు. తీవ్రంగా గాయపడిన వారు పోర్టుబ్లెయిర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మృతులంతా చేనేత కుటుంబాలకు చెందిన వారని తెలుస్తోంది. టూర్ నిర్వాహకుడు సెల్వరాజ్ ప్రాణాపాయ స్థితిలో పోర్టుబ్లెయిర్‌లో చికిత్స పొందుతున్నాడు. ఇతని కుమారుడు, కోడలు మృతి చెందగా, వీరి కుమార్తె పూజ(6) గౌనుకు పడవలోని ఒక ఇనుప క మ్మీ తగులుకోవడంతో అదృష్టవశాత్తు బయటపడింది.  
 
 విషాద యాత్ర..
 రాష్ట్రానికి చెందిన 19 మందిని కడలి పొట్టనపెట్టుకుందన్న సమాచారంతో రాష్ట్రం శోకసంద్రంలో మునిగిపోయింది. విహార యాత్ర విషాదయాత్రగా మారిపోవడంతో బాధిత కుటుంబాల రోదనలు మిన్నంటాయి. తల్లిదండ్రులను కోల్పోయిన పసికూన, కొడుకు, కోడలు కడలిలో కలిసిపోగా ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న వృద్ధుడు, తృటిలో చావు తప్పించుకున్న పర్యాటకులు బరువెక్కిన గుండెతో విషాదాన్ని మోసుకొచ్చారు. ముద్దుల మనవరాలు పూజ పేరున పూజా ట్రావెల్స్ విదేశీయాత్రలు నిర్వహించే కే సెల్వరాజ్‌కంచి సమీపంలోని కవిరై వీధి, మిన్ నగర్, కుమార్ వీధి, పీఎస్‌కే నగర్, ఎన్నైకార్ వీధి, చెన్నై నగరానికి చెందిన  32 మందితో అండమాన్ యాత్ర వేశారు. తన వారినందరినీ అండమాన్‌కు తీసుకెళ్లాడు. కొడుకు మణికంఠన్, కోడలు ఉషా ఆర్తనాదాలు చేస్తూ సముద్రంలో కలిసిపోయారు. తన కళ్లెదుటే మునిగిపోతున్న తల్లిదండ్రులను చూసి ఆరేళ్ల పూజ అమ్మా, నాన్నా అంటూ రోదిస్తూ సముద్రంలోకి దొర్లుతున్న సమయంలో పడవలోని ఇనుపకొక్కీకి చిన్నారి గౌను చిక్కుకుని ప్రాణాలు దక్కించుకుంది.
 
 వారందరి పెద్దదిక్కైన సెల్వరాజ్ కూడా ప్రాణాపాయ స్థితిలో పోర్టుబ్లెయిర్ ఆస్పత్రిలో చేరిపోగా చిన్నారి ఒంటిరిగా మిగిలిపోయింది. పడవ మునిగిపోతున్న సమయంలో మూడు ముక్కలై ంది. అందులోని ఒక ప్లాస్టిక్ ముక్కను పట్టుకుని పదిమంది కొంత సేపు వేలాడామని, ఆ తరువాత గజ ఈతగాళ్లు వచ్చి రక్షించారని కంచిలో హోటల్ నడుపుతున్న గురునాథన్ చెప్పాడు. అయితే తమలోని సురేష్ అనే వ్యక్తి గల్లంతైనట్లు తెలిపాడు. పోలీస్ ట్రైనింగ్ కాలేజీలో అసిస్టెంట్ సూపరింటెండెంట్‌గా పనిచేసే చెన్నైకి చెందిన రాజేంద్రన్, భార్య వల్లి తృటిలో తప్పించుకున్నారు. పడవ బోల్తా పడగానే ఇద్దరూ ఓవైపు పట్టుకుని ఊగులాడుతూ 45 నిమిషాలపాటూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గడిపారు. అదే సమయంలో మునిగిపోతున్న ఇద్దరు తోటి మహిళా పర్యాటకులను రక్షించారు.
 
 చెన్నై చేరుకున్న మృతదేహాలు
 అండమాన్ పడవ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారికోసం పది శవపేటికలతో అధికారులు సోమవారం ఉదయం బయలుదే రి వెళ్లారు. సోమవారం సాయంత్రానికి మృతదేహాలను చెన్నైకు తీసుకొచ్చేశారు. కంచి కలెక్టర్ భాస్కర్ సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. సీఎం జయలలిత, టీఎన్‌సీసీ అధ్యక్షుడు జ్ఞానదేశికన్ డీఎండీకే అధినేత విజయకాంత్, పీఎంకే అధినేత రాందాస్ తదితరులు సంతాపం ప్రకటించారు. లైఫ్ జాకెట్ లేకుండానేసాధారణ నదుల్లో, చెరువుల్లో నిర్వహించే బోటు షికారులో తీసుకునే కనీస జాగ్రత్తలు కూడా సముద్రయానంలో తీసుకోలేదని ప్రాణాలతో బయటపడిన బాధితుడు చెప్పాడు. తాము ఎక్కేటపుడు పడవలో 25 మంది మాత్రమే ఉన్నారని, క్రమేణా సంఖ్య పెరిగారని తెలిపాడు. పడవ బయలుదేరేటపుడే ఒకవైపు ఒరిగినట్లుగా సాగిందని, నడిసముద్రంలో అలలతీవ్రత పెరగడంతో ప్రయాణికుల బరువును తట్టుకోలేని పడవ బోల్తాపడిందని తెలిపాడు. ప్రయాణ సమయంలో ఎవరికీ లైఫ్‌జాకెట్లు ఇవ్వలేదని, వాటిని ఇచ్చి ఉంటే ఇంత భారీ ప్రాణనష్జం జరిగి వుండేది కాదని అతను వాపోయాడు.
 
 జయ తక్షణ సహాయ చర్యలు
 ప్రమాదం జరిగిన సంగతి తెలియగానే ముఖ్యమంత్రి జయలలిత తక్షణ సహాయ చర్యలు చేపట్టారు. ప్రభుత్వ ఖర్చులతో బాధితులను తీసుకువచ్చేందుకు రాష్ట్రప్రభుత్వాధికారి శ్రీధర్ సోమవారం అండమాన్ బయలుదేరి వెళ్లారు. మృతుల కుటుంబాలకు సీఎం లక్ష రూపాయల చొప్పున అందజేస్తున్నట్లు ప్రకటించారు.ండమాన్ దీవిలో చోటుచేసుకున్న పడవ ప్రమాదం తమిళనాడుకు చెందిన 19 మంది ప్రాణాలను కబళించివే యగా చెన్నై, కాంచీపురంలోని వారి కుటుంబీకులు కన్నీటికడలిలో మునిగిపోయారు. కాంచీపురం కూరంగ్రామానికి చెందిన కే సెల్వరాజ్ పూజాట్రావెల్స్ పేరుతో విదేశీ విహార యాత్రలు నిర్వహిస్తుంటాడు. ఈనెల 26న రిపబ్లిక్ దినోత్సవం సందర్భంగా చె న్నై, కంచికి చెందిన 32 మందితో అండమాన్ టూర్ వేశాడు. వీరిలో 16 మంది పురుషులు, 13 మంది స్త్రీలు, ముగ్గురు బాలికాశిశువులు ఉన్నారు. విమానంలో వీరందరినీ అండమాన్‌కు చేరిన అనంతరం సముద్ర విహారానికి 25 మంది ప్రయాణికులు సామర్ద్యం కలిగిన పడవలోకి మహారాష్ట్రకు చెందిన వారు కూడా కలిసి 46 మంది ఎక్కారు. ఈనెల 26 వ తేదీ సాయంత్రం 4 గంటల సమయంలో వీరంతా నడిసముద్రంలో ప్రయాణిస్తుండగా సముద్రపు అలలతో కుదుపులకు లోనైన పడవ ఒక్కసారిగా ఒకవైపు ఒరిగిపోయింది. 
 
 దీంతో పడవలోని 31 మంది నీటమునిగి ప్రాణాలు కోల్పోగా వీరిలో చెన్నై, కంచికి చెందిన 19 మంది ఉన్నారు. పద్మిని (54), కరుణాకరన్ (61), వనజ (49), దొరై జయకుమార్ (61), అనసూయ (57), పెరుమాళ్ (68), మేనాళ్ (62), అంజలం (58), మణికంఠన్ (35), ఉషా (30), సురేష్ (33), దర్శిని (7), శాంతాబాయి (55), శాంతీబాయి (55), గణపతి (63), సుశీల (51), దురైరాజ్ (45), అనురాధా (52), పీ సెల్వరాజ్ (64)లు మృతిచెందారు. సుమారు ముగ్గురు సముద్రంలో గల్లంతైనట్లు సమాచారం. స్వల్పంగా గాయపడిన వారికి ప్రాధమిక చికిత్స చేసి పంపివేశారు. తీవ్రంగా గాయపడిన వారు పోర్టుబ్లెయిర్‌లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మృతులంతా చేనేత (సాలె) కుటుంబాలకు చెందిన వారని తెలుస్తోంది. టూర్ నిర్వాహకుడు సెల్వరాజ్ ప్రాణాపాయ స్థితిలో పోర్టుబ్లెయిర్‌లో చికిత్స పొందుతున్నాడు. ఇతని కుమారుడు, కోడలు చనిపోగా వీరి కుమార్తె ఆరేళ్ల పూజ గౌనుకు పడవలోని ఒక ఇనుప క మ్మీ తగులుకోవడంతో నీటిలో మునిగిపోకుండా అదృష్టవశాత్తు బయటపడింది. తల్లిదండ్రులు కళ్లెదుటే నీటిలో మునిగిపోతుండగా చూసిన ఈ చిన్నారి కాపాడండీ అంటూ దయనీయంగా కేకలు వేసినట్లు ప్రత్యక్ష సాక్షులు చెప్పారు.
 

 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement