ప్రయాణికులతో అండమాన్కు వెళ్తూ.. సాంకేతిక లోపం తలెత్తడంతో నడి సముద్రంలో నిలిచిన హర్షవర్దన్ నౌక గురువారం తిరిగి విశాఖకు చేరుకుంది. మంగళవారం మధ్యాహ్నం 1.20 గంటలకు దాదాపు 600 మంది ప్రయాణికులతో విశాఖ పోర్టు నుంచి అండమాన్కు బయలుదేరింది. అయితే బయలుదేరిన రెండు మూడు గంటలకే... నౌకలోని జనరేటర్లలో సాంకేతిక సమస్య తలెత్తింది.దీంతో నౌక నడి సముద్రంలో నిలిచిపోయింది. బుధవారం విశాఖ నుంచి ఇంజినీర్లు వెళ్లి.. జనరేటర్లకు మరమ్మతులు చేశారు. అనంతరం తిరిగి విశాఖకు తీసుకువచ్చారు. దాదాపు 38 గంటల పాటు ప్రయాణికులు సముద్రంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కనీస సౌకర్యాలు కల్పించలేదని ప్రయాణికులు పోర్టు ట్రస్ట్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Published Thu, Sep 29 2016 6:36 AM | Last Updated on Thu, Mar 21 2024 5:16 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement