అండమాన్- నికోబార్ దీవులలోని ఓటర్ల సంఖ్యను ఇటీవల ఎన్నికల సంఘం వెల్లడించింది. భారతదేశంలోని ఈ కేంద్రపాలిత ప్రాంతంలో మొత్తం 3,15,000 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 52 శాతం పురుషులు, 48 శాతం మహిళలు. అండమాన్- నికోబార్ దీవుల చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ బిఎస్ జగ్లాన్ తెలిపిన వివరాల ప్రకారం 18-19 ఏళ్ల మధ్య వయస్సు గల 5300 మంది ఓటర్లు మొదటిసారి ఓటర్ల జాబితాలో తమ పేరు నమోదు చేయించుకున్నారు.
ఎన్నికల సంఘం లెక్కల ప్రకారం 2024 లోక్‌సభ ఎన్నికల్లో దేశం మొత్తం మీద ఓటర్ల సంఖ్య 96.8 కోట్లు. వీరిలో 49.7 కోట్ల మంది పురుషులు కాగా, 47.1 కోట్ల మంది మహిళా ఓటర్లు . 2019తో పోలిస్తే ఓటర్ల సంఖ్య 6 శాతం మేరకు పెరిగింది. ఏప్రిల్ 19న అండమాన్ నికోబార్ దీవుల్లో తొలి దశలో ఓటింగ్ జరగనుంది. బిష్ణు పద్ రేకు ఎన్‌డిఏ కూటమి టికెట్ ఇవ్వగా, ఇండియా కూటమి నుంచి కుల్దీప్ రాయ్ శర్మను అభ్యర్థిగా నిలిపారు. ఇక్కడి నుంచి ప్రస్తుత ఎంపీ కుల్దీప్. 2014లో ఇక్కడి నుంచి బీజేపీ అభ్యర్థి బిష్ణు పద్ రే ఎంపీగా ఎన్నికయ్యారు. 2019లో బీజేపీ విశాల్ జాలీకి టిక్కెట్ కేటాయించింది. నాడు కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల మధ్య హోరాహోరీ పోటీ నెలకొంది. కుల్దీప్‌కు 95,308 ఓట్లు రాగా, విశాల్‌కు 93,901 ఓట్లు వచ్చాయి. ఈసారి కూడా బీజేపీ-కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోటీ జరిగే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు.
అండమాన్ నికోబార్ లోక్ సభ స్థానం కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. ఇక్కడ 1967లో తొలిసారిగా ఎన్నికలు జరగ్గా, కాంగ్రెస్ అభ్యర్థి కేఆర్ గణేష్ ఎంపీగా ఎన్నికయ్యారు. ఆయన మంత్రివర్గంలో కూడా చేరారు. ఆయన 1971లో కూడా గెలిచారు. 1977 నుంచి 1999 వరకు కాంగ్రెస్‌కు చెందిన మనోరంజన్ భక్త్ వరుసగా ఎనిమిది సార్లు గెలిచారు. 1999లో బీజేపీకి చెందిన బిష్ణు పద్ రే తొలిసారిగా ఇక్కడి నుంచి ఎంపీ అయ్యారు. 2004లో మనోరంజన్ భక్త్ తిరిగి గెలిచారు. బిష్ణు పద్ రే 2009, 2014లో ఎంపీగా ఉన్నారు. కులదీప్ రాయ్ శర్మ 2019లో ఎంపీగా ఎన్నికయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment