
ప్రియుడు శ్రీధర్, నిందితురాలు అమృత
కర్ణాటక, కృష్ణరాజపురం: ప్రేమకు అడ్డుచెప్పిందనే కారణంగా తల్లిని హత్య చేసి ప్రియునితో పారిపోయిన ఘటనలో నిందితురాలు అమృతను బుధవారం కేఆర్ పురం పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమె అండమాన్ దీవుల్లో దొరకడం గమనార్హం. ఆదివారం అర్ధరాత్రి ఇంట్లో నిద్రిస్తున్న తల్లి నిర్మలతో పాటు తమ్ముడు హరీశ్‌పై కత్తితో పొడిచిన అమృత అదేరోజు ప్రియుడు శ్రీధర్‌రావుతో పరారైంది. ఈ ఘటనలో తల్లి నిర్మల మృతి చెందగా తమ్ముడు హరీశ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ కెమెరాల చిత్రాల ఆధారంగా విచారణ చేపట్టి అమృత ప్రియునితో కలిసి అండమాన్ దీవుల్లోని పోర్ట్‌బ్లెయిర్‌కు పారిపోయినట్లు గుర్తించారు. వారి సెల్‌ఫోన్ల లొకేషన్ల ఆధారంగా గుర్తించారు. బుధవారం పోర్ట్‌బ్లెయిర్ చేరుకున్న పోలీసులు బృందం ఇద్దరిని అరెస్ట్ చేసి బెంగళూరుకు తరలిస్తున్నారు.