అండమాన్ నికోబార్ నుంచి వస్తున్న ఓ ప్రయాణీకుడు (46)విమానంలోనే ప్రాణాలు విడిచాడు. రాబర్ట్ అనే వ్యక్తి మెరుగైన వైద్యంకోసం కుటుంబ సభ్యులతో కలిసి చెన్నైకి బయలు దేరాడు. కానీ ఇంతలోనే ఏమైందో ఏమో తెలియదు గానీ విమానంలోనే విగతజీవిగా మారిపోయాడు.
చెన్నై: అండమాన్ నికోబార్ దీవుల నుంచి వస్తున్న ఓ ప్రయాణికుడు (46) విమానంలోనే ప్రాణాలు విడిచాడు. రాబర్ట్ అనే వ్యక్తి మెరుగైన వైద్యం కోసం కుటుంబ సభ్యులతో కలిసి చెన్నైకి బయలుదేరాడు. కానీ ఇంతలోనే ఏమైందో తెలియదు గానీ విమానంలోనే విగతజీవిగా మారిపోయాడు.
విమానం చెన్నై విమానాశ్రయంలో దిగగానే, అతడు అచేతనంగా పడి ఉండటాన్ని గమనించిన కుటుంసభ్యులు, తోటి ప్రయాణికులు విమాన సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో వారు విమానాశ్రయంలోని వైద్యబృందాన్ని సంప్రదించారు. అయితే అతను అప్పటికే మరణించినట్టుగా వైద్యులు ధ్రువీకరించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న మీనంబాకం పోలీసులు దాన్ని పోస్ట్ మార్టానికి తరలిచారు. అయితే రాబర్ట్ మరణానికి గల కారణాలను పోస్ట్మార్టం నివేదిక తర్వాత మాత్రమే చెప్పగలమని వారంటున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని వారు తెలిపారు.