ప్రముఖ పుణ్య క్షేత్రం తిరుమలలో భారీగా గుట్కా పట్టుకున్నారు.
తిరుమలలో భారీగా గుట్కా
Published Fri, Sep 8 2017 4:26 PM | Last Updated on Wed, Sep 26 2018 6:49 PM
తిరుమల: ప్రముఖ పుణ్య క్షేత్రం తిరుమలలో భారీగా గుట్కా పట్టుకున్నారు. తిరుమలలోని ప్రతివాది భయంకర్ మఠంలో పోలీసులు శుక్రవారం మధ్యాహ్నం తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా పెద్దమొత్తంలో గుట్కాప్యాకెట్లు బయటపడ్డాయి. ఇందుకు సంబంధించి మఠం మేనేజర్ కైలాస్ అగర్వాల్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీనిపై విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.
Advertisement
Advertisement