మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో అక్రమంగా గుట్కా ప్యాకెట్లను తరలిస్తున్న నలుగురిని పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు.
తొర్రూరు: మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో అక్రమంగా గుట్కా ప్యాకెట్లను తరలిస్తున్న నలుగురిని పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ. 13 లక్షల విలువైన గుట్కా, పొగాకు ప్కాకెట్లతో పాటు రెండు వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. వీరితో పాటు నకిలీ పత్తి విత్తనాలు విక్రయిస్తున్న మరో ఇద్దరిని అదుపులోకి తీసుకొని రూ. 2 లక్షల విలువైన నకిలీ విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు జిల్లా ఎస్పీ కోటిరెడ్డి ఈరోజు విలేకరుల సమావేశంలో వివరాలు తెలిపారు.