గుట్కా ప్యాకెట్లు స్వాధీనం
అక్రమంగా తరలిస్తున్న గుట్కా ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ప్యాపిలి: అక్రమంగా తరలిస్తున్న గుట్కా ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కర్ణాటక రాష్ట్రం బళ్లారి నుంచి నంద్యాలకు గుట్కా ప్యాకెట్లను అక్రమంగా తరలిస్తున్నారన్న సమాచారం మేరకు సీఐ ప్రసాద్, ఎస్‌ఐ సురేష్ జలదుర్గం గ్రామ శివారులో వాహనాల తనిఖీ చేపట్టారు. ఆ సమయంలో మినీ లారీలో గుట్కా ప్యాకెట్లను తరలిస్తున్న లారీని గుర్తించారు. అందులో రూ. 3 లక్షలు విలువ చేసే 52 గుట్కా ప్యాకెట్ల బాక్సులను స్వాధీనం చేసుకున్నారు. కర్ణాటక రాష్ట్రం బళ్లారి నుంచి నంద్యాలకు చెందిన మోయిన్ సాహెబ్‌కు చైనీ గుట్కా ప్యాకెట్లను తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ మేరకు మోయిన్ సాహెబ్‌తో పాటు లారీ డ్రైవర్ రియాజ్, లారీలో ఉన్న సుబహాన్‌లపై కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.