కొందరు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారుల అండదండలతో గుట్కా, పాన్‌మసాలాల అక్రమదందా యథేచ్ఛగా సాగుతోంది. హైదరాబాద్ కేంద్రంగా నిషేధిత గుట్కా, పాన్‌మసాలాలను జనావాసాల మధ్యే అక్రమార్కులు తయారుచేసి నిల్వ చేస్తున్నారు. అఫ్జల్‌గంజ్, ఉస్మాన్‌గంజ్‌ట్రాన్స్‌పోర్ట్ కంపెనీల ద్వారా పట్టపగలే ఎగుమతి చేస్తున్నారు.