panmasala
-
‘గుట్కా’ చీకటి వ్యాపారులు అప్రమత్తం
నగరంలో ఉత్పత్తి, సరఫరా నిలిపివేత పెద్దల ఆశీస్సుల కోసం ప్రయత్నాలు సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఆదేశాలు ఉల్లంఘిస్తూ గుట్కా, పాన్‌మసాలా తయారీ, పంపిణీ, నిల్వలపై ‘సాక్షి’ పత్రికలో వచ్చిన కథనాలపై అప్రమత్తమైన వ్యాపారులు, హోల్‌సేల్ డీలర్లు నగరంలో రిటైల్ పాయింట్లకు సరఫరాను పూర్తిగా నిలిపేశారు. దీంతో గుట్కా ధర అమాంతం పెరిగిపోయింది. కాగా, పలువురు ప్రజాప్రతినిధులు, అధికారుల అండదండలతో నగరంలో గుట్కా సామ్రాజ్యాన్ని భారీగా విస్తరించిన వ్యాపారులు తమ లాభాల్లో అందరికీ వాటాలు ఇస్తూ వ్యాపారాన్ని నిర్వహిస్తున్నారు. తాజాగా తమపై ఎలాంటి ఒత్తిళ్లు లేకుండా ఆయా పార్టీల పెద్దల ఆశీస్సుల కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. వచ్చే 5 రోజుల పాటు గుట్కా తయారీ, హోల్‌సేల్ సరఫరాను నిలిపేసి, ఈ లోగా అన్ని పరిస్థితులు చక్కబెట్టుకోవాలన్న ఆలోచనలో వీరు ఉన్నట్టు సమాచారం. -
అందరూ.. ‘గుట్కా’య స్వాహా!
-
అందరూ.. ‘గుట్కా’య స్వాహా!
దందాకు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారుల అండదండలు సాక్షి, హైదరాబాద్: కొందరు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారుల అండదండలతో గుట్కా, పాన్‌మసాలాల అక్రమదందా యథేచ్ఛగా సాగుతోంది. హైదరాబాద్ కేంద్రంగా నిషేధిత గుట్కా, పాన్‌మసాలాలను జనావాసాల మధ్యే అక్రమార్కులు తయారుచేసి నిల్వ చేస్తున్నారు. అఫ్జల్‌గంజ్, ఉస్మాన్గంజ్ట్రాన్స్పోర్ట్ కంపెనీల ద్వారా పట్టపగలే ఎగుమతి చేస్తున్నారు. గుట్కా సామ్రాజ్యాన్ని ఏలుతున్న ఓ వ్యాపారికి ప్రధాన డీలర్‌గా ప్రతిపక్ష పార్టీకి చెందిన ఓ నాయకుడు వ్యవహరిస్తున్నట్లు ఫిర్యాదులున్నాయి. మరో 2 ప్రధాన పార్టీల నాయకులు అక్రమదందాకు పూర్తిగా సహకరిస్తున్నారనే ఆరోపణలు న్నాయి. నగరంలో జరిగే పార్టీల సభలు, సమావేశాలు, ఆయా మతాల ధార్మిక సంస్థలు, ఉత్సవాలకు గుట్కా తయారీ సంస్థలు భారీగా విరాళాలిస్తుండటంతో నాయకులె వరూ నోరు మెదపని స్థితి నెలకొంది. అఫ్జల్, ఉస్మాన్గంజ్లు కేంద్రంగా అక్రమ రవాణా నగరంలో భారీ ఎత్తున తయారీ అవుతోన్న నిషేధిత గుట్కా ఉత్పత్తుల రవాణాకు అఫ్జల్‌గంజ్, ఉస్మాన్‌గంజ్, ఫీల్‌ఖానా, గోషామహల్, మంగళ్ హాట్‌లోని ట్రాన్స్పోర్ట్ కార్యాలయాలు కేంద్రంగా మారుతున్నాయి. వివిధ బ్రాండ్ల గుట్కా పాన్‌మసాలాలు, జర్దాలు ట్రాన్స్‌పోర్ట్‌ల ద్వారా తెలంగాణలోని పలు జిల్లాలకు, పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, కర్నాటక, తమిళనాడు, మహారాష్ట్రలకు సరఫరా చేస్తున్నారు. గుట్కా వ్యాపారుల మంత్రాంగం బుధవారం ‘సాక్షి’ ప్రధాన సంచికలో ‘గుట్కా’య స్వాహా శీర్షికన వచ్చిన కథనం గుట్కా తయారీ, పంపిణీదారుల్లో కలవరం రేపింది. ఈ నేపథ్యంలో వారంతా మెహదీపట్నంలోని ఓ ఫంక్షన్హాల్లో సమావేశమై అధికారులెవరూ తమ అక్రమ వ్యాపారం వైపు కన్నెత్తి చూడకుండా ఏం చేయాలన్న అంశంపై ప్రణాళిక రూపొందించినట్లు సమాచారం. ఇటీవలే గుట్కా వ్యాపారులంతా అధికార పార్టీకి చెందిన ‘నేత’ను కలసి తమకు సహకరించాలని, అందుకు తమ సహాయ సహకారులుంటాయని స్పష్టం చేసినట్లు సమాచారం. ఒకటి, రెండు రోజుల్లో అధికార పార్టీ నేతను కలసి మరోసారి ఆశీస్సులు పొందాలని నిర్ణయించినట్లు సమాచారం. -
యథేచ్ఛగా గుట్కా విక్రయాలు
- లోపించిన అధికారుల నిఘా - రెట్టింపు ధరలతో విక్రయం బాన్సువాడ : ప్రాణాంతకంగా మారిన గుట్కా, పాన్‌మసాల విక్రయాన్ని ప్రభుత్వం నిషేధించినప్పటికీ, గుట్టుచప్పుడుకాకుండా యథేచ్ఛగా గుట్కా విక్రయాలు సాగుతున్నాయి. గుట్కా నిర్ణీత ధరకు రెండింతలు పెంచి విక్రయిస్తున్న వ్యాపారులపై చర్యలు తీసుకోవడంలో సంబంధిత అధికార యంత్రాంగం విఫలమవుతుండడంతో బ్లాక్ మార్కెట్ విస్తరించింది. జిల్లాలో గుట్కా, పాన్ మసాలా బ్లాక్ మార్కెటింగ్ నిత్యం రూ. 5 లక్షలకు పైగా అమ్మకాలు జరుగుతున్నాయి. పట్టించుకోవాల్సిన అధికారులు మామూళ్ల మత్తులో జోగుతున్నారు. వాణి జ్య పన్నుల శాఖ, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, పోలీసులు, విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు గుట్కా విక్రయాలను అరికట్టాల్సి ఉంది. అలాగే మున్సిపాలిటీల్లో మున్సిపల్ హెల్త్ అధికారులు దాడి చేయాలి. కానీ ఈ అధికారులు కన్నెత్తి చూడడం లేదు. గుట్కా హోల్‌సెల్ వ్యాపారుల నుంచి నెలవారీ మామూళ్లు అధికారులకు అందుతున్నాట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గుట్కా, పాన్‌మసాలా లాంటి పొగాకు ఉత్పత్తులు క్యాన్సర్‌తోపాటు పలు రకాల రోగాలకు కారణమవుతున్నాయని భావించి ప్రభుత్వం గతేడాది జనవరి 15 నుంచి వీటి విక్రయాలను నిషేధించింది. అయితే ఉన్న గుట్కా స్టాకును విక్రయించుకొనే పేరుతో వ్యాపారులు అక్రమ అమ్మకాలు చేస్తున్నారు. గుట్కా, పాన్ మసాలాకు అలవాటుపడిన వారి బలహీనతలను ఆసరాగా చేసుకొని అసలు ధర కంటే రెండు, మూడు రేట్లు అధిక ధరలకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. గుట్కా, పాన్ మసాలాలను హైదరాబాద్‌తోపాటు మహారాష్ట్రాలోని నాందేడ్, దెగ్లూర్, కర్ణాటకలోని ఔరాద్ తదితర ప్రాంతాల నుంచి స్థానికంగా కొంత మంది హోల్‌సేల్ వ్యాపారులు దిగుమతి చేసుకుంటున్నారు. వీరి నుంచి జిల్లాలోని మండల కేంద్రాలు, గ్రామాల్లోని పాన్ షాపులకు సరఫరా అవుతోంది. బాన్సువాడ, బోధన్ పట్టణాల్లో నిలువ చేస్తూ పరిసర మండలాలకు ఆటోలు, మోటర్ సైకిళ్లపై అతి రహస్యంగా చేరవేస్తున్నారు. రాత్రి వేళ నల్ల ప్లాస్టిక్ కవర్లలో గుట్కాలు వేసుకొని వారికి చేరవేస్తారు. పాన్ షాపుల్లో గుట్కాలను బయటవారి కంట పడనీయకుండా రహస్యంగా విక్రయిస్తున్నారు. నిజామాబాద్ నగరంలోని అహ్మదీ బజార్లో రహస్యంగా హోల్ సెల్ విక్రయాలు సాగుతున్నట్లు సమాచారం. అక్రమంగా దిగుమతి చేసుకున్న నిషేధిత కంపెనీల గుట్కాలు, పాన్‌మసాలా ప్యాకెట్లను అసలు ధరకన్నా రెండు మూడు రేట్లు అధిక ధరకు విక్రయిస్తున్నారు. గతంలో రూ. 1.50 ధర ఉన్న గుట్కా ప్రస్తుతం రూ. 5, రూ. 3 ఉన్న గుట్కా ప్యాకెట్‌ను ప్రస్తుతం రూ. 8, రూ. 4 విలువ గల గుట్కా రూ. 10, రూ. 10 ఉండే రకం రూ. 20కు విక్రయిస్తున్నారు. కాగా గుట్కాకు అలవాటు పడిన వారు ధర ఎక్కువైనా కొనుగోలు చేస్తున్నారు. దీన్ని అసరాగా చేసుకొని హోల్‌సెల్ వ్యాపారులు, పాన్‌షాపుల యజమానులు యథేచ్ఛగా దోచుకొంటున్నారు. గుట్కా విక్రయాలు విచ్చలవిడిగా సాగుతున్నా, సంబంధిత శాఖ అధికారులు పట్టించుకోవడం లేదు. ముఖ్యంగా యువత గుట్కా వ్యసనానికి అలవాటు పడి తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నారు. వాటిలో ఉండే పలు రసాయనాల ప్రభావంతో క్యాన్సర్‌తోపాటు ఇతర ప్రమాదకరమైన వ్యాధుల బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి గుట్కా విక్రయాలను అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు.