ప్రభుత్వ ఆదేశాలు ఉల్లంఘిస్తూ గుట్కా, పాన్‌మసాలా తయారీ, పంపిణీ, నిల్వలపై ‘సాక్షి’ పత్రికలో వచ్చిన కథనాలపై అప్రమత్తమైన వ్యాపారులు, హోల్‌సేల్ డీలర్లు నగరంలో రిటైల్ పాయింట్లకు సరఫరాను పూర్తిగా నిలిపేశారు.
నగరంలో ఉత్పత్తి, సరఫరా నిలిపివేత పెద్దల ఆశీస్సుల కోసం ప్రయత్నాలు
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఆదేశాలు ఉల్లంఘిస్తూ గుట్కా, పాన్‌మసాలా తయారీ, పంపిణీ, నిల్వలపై ‘సాక్షి’ పత్రికలో వచ్చిన కథనాలపై అప్రమత్తమైన వ్యాపారులు, హోల్‌సేల్ డీలర్లు నగరంలో రిటైల్ పాయింట్లకు సరఫరాను పూర్తిగా నిలిపేశారు. దీంతో గుట్కా ధర అమాంతం పెరిగిపోయింది. కాగా, పలువురు ప్రజాప్రతినిధులు, అధికారుల అండదండలతో నగరంలో గుట్కా సామ్రాజ్యాన్ని భారీగా విస్తరించిన వ్యాపారులు తమ లాభాల్లో అందరికీ వాటాలు ఇస్తూ వ్యాపారాన్ని నిర్వహిస్తున్నారు.
తాజాగా తమపై ఎలాంటి ఒత్తిళ్లు లేకుండా ఆయా పార్టీల పెద్దల ఆశీస్సుల కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. వచ్చే 5 రోజుల పాటు గుట్కా తయారీ, హోల్‌సేల్ సరఫరాను నిలిపేసి, ఈ లోగా అన్ని పరిస్థితులు చక్కబెట్టుకోవాలన్న ఆలోచనలో వీరు ఉన్నట్టు సమాచారం.