
చెన్నె: దుకాణంలో పొగాకు ఉత్పత్తులు విక్రయిస్తున్నాడని సమాచారం రాగా పోలీసులు దాడి చేసి దుకాణ నిర్వాహకుడిని అదుపులోకి తీసుకున్నారు. పొగాకు ఉత్పత్తులతో పాటు అతడి సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. పొగాకు ఉత్పత్తులు ఎవరూ సరఫరా చేస్తారనే వివరాలు తెలుసుకునేందుకు అతడి ఫోన్ పోలీసులు పరిశీలించగా దారుణ దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. ఐదు మంది బాలికలపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఆ దృశ్యాలను వీడియోలు తీసి తన మిత్రులకు పంచుకున్న పాపాత్ముడు అతడు. ఆ విధంగా మొత్తం 50 వీడియోలు ఉండడంతో పోలీసులు షాక్‌కు గురయ్యారు. అతడిని వెంటనే వివిధ సెక‌్షన్ల కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ సంఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. (చదవండి: ఆన్‌లైన్ క్లాసులు పక్కనపెట్టి నగ్న వీడియోలతో బాలిక)
టీపీ చత్రం పోలీస్‌స్టేషన్ పరిధిలో పెరుమాల్ (40) ఓ దుకాణం నిర్వహిస్తున్నాడు. పొగాకు ఉత్పత్తుల విక్రయంపై సమాచారం రాగా శనివారం దుకాణంపై దాడులు చేయగా ఆ బాలికలపై దురాఘాతం వెలుగులోకి వచ్చింది. దుకాణంలో ఆడుకోవడానికి వచ్చిన బాలికలను, దుకాణంలో బాకీ పెట్టిన మహిళల కుమార్తెలపై పెరుమాల్ అత్యాచారానికి పాల్పడుతున్నాడు. ఆ దృశ్యాలను సెల్‌ఫోన్‌లో వీడియోలు తీయించుకున్నాడు. అలా మొత్తం 50 వీడియోలు ఉన్నాయి. విచారణ చేపట్టగా ఆరు నెలల నుంచి బాలికలపై తరచూ అఘాయిత్యానికి పాల్పడుతున్నట్లు తేలింది.
అతడికి ఇద్దరు అక్కాచెల్లెళ్లు సహకరించారు. తమ కూతుళ్లను కూడా అతడికి బలి పెట్టారు. తమ కూతుళ్లను అతడి వద్దకు పంపించడం దిగ్భ్రాంతికి గురి చేసే విషయం. వారిద్దరూ కూడా అతడితో సంబంధం కొనసాగిస్తున్నారు. తమ కూతుళ్లపై ఆ విధంగా చేయడంతో ఆ మహిళలు దుకాణం నుంచి సామగ్రి, సరుకులు ఉచితంగా తీసుకెళ్తున్నారని డిప్యూటీ కమిషనర్ కార్తికేయన్ తెలిపారు. ఇక మిగతా ముగ్గురు బాలికలు దుకాణంలోకి ఆడుకునేందుకు రాగా వారిని అతడు చెరబట్టాడు. ఆ ఫోన్ చూడకుండా ఉండి ఉంటే ఇంత ఘోర విషయాలు తెలియకపోయేవి అని కమిషనర్ తెలిపారు. ప్రస్తుతం బాలికలను చైల్డ్ హోమ్‌కు తరలించినట్లు తెలిపారు. పోక్సో చట్టం కింద పెరుమాల్‌ను, అతడికి సహకరించిన ఇద్దరు తల్లులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
చదవండి: సమాజం తలదించుకునే ఘటన.. మహిళను వివస్త్ర చేసి.. కారం చల్లి
Comments
Please login to add a commentAdd a comment