దందాకు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారుల అండదండలు
సాక్షి, హైదరాబాద్: కొందరు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారుల అండదండలతో గుట్కా, పాన్‌మసాలాల అక్రమదందా యథేచ్ఛగా సాగుతోంది. హైదరాబాద్ కేంద్రంగా నిషేధిత గుట్కా, పాన్‌మసాలాలను జనావాసాల మధ్యే అక్రమార్కులు తయారుచేసి నిల్వ చేస్తున్నారు. అఫ్జల్‌గంజ్, ఉస్మాన్‌గంజ్‌ట్రాన్స్‌పోర్ట్ కంపెనీల ద్వారా పట్టపగలే ఎగుమతి చేస్తున్నారు.
గుట్కా సామ్రాజ్యాన్ని ఏలుతున్న ఓ వ్యాపారికి ప్రధాన డీలర్‌గా ప్రతిపక్ష పార్టీకి చెందిన ఓ నాయకుడు వ్యవహరిస్తున్నట్లు ఫిర్యాదులున్నాయి. మరో 2 ప్రధాన పార్టీల నాయకులు అక్రమదందాకు పూర్తిగా సహకరిస్తున్నారనే ఆరోపణలు న్నాయి. నగరంలో జరిగే పార్టీల సభలు, సమావేశాలు, ఆయా మతాల ధార్మిక సంస్థలు, ఉత్సవాలకు గుట్కా తయారీ సంస్థలు భారీగా విరాళాలిస్తుండటంతో నాయకులె వరూ నోరు మెదపని స్థితి నెలకొంది.
అఫ్జల్, ఉస్మాన్‌గంజ్‌లు కేంద్రంగా అక్రమ రవాణా
నగరంలో భారీ ఎత్తున తయారీ అవుతోన్న నిషేధిత గుట్కా ఉత్పత్తుల రవాణాకు అఫ్జల్‌గంజ్, ఉస్మాన్‌గంజ్, ఫీల్‌ఖానా, గోషామహల్, మంగళ్ హాట్‌లోని ట్రాన్స్‌పోర్ట్ కార్యాలయాలు కేంద్రంగా మారుతున్నాయి. వివిధ బ్రాండ్ల గుట్కా పాన్‌మసాలాలు, జర్దాలు ట్రాన్స్‌పోర్ట్‌ల ద్వారా తెలంగాణలోని పలు జిల్లాలకు, పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, కర్నాటక, తమిళనాడు, మహారాష్ట్రలకు సరఫరా చేస్తున్నారు.
గుట్కా వ్యాపారుల మంత్రాంగం
బుధవారం ‘సాక్షి’ ప్రధాన సంచికలో ‘గుట్కా’య స్వాహా శీర్షికన వచ్చిన కథనం గుట్కా తయారీ, పంపిణీదారుల్లో కలవరం రేపింది. ఈ నేపథ్యంలో వారంతా మెహదీపట్నంలోని ఓ ఫంక్షన్‌హాల్‌లో సమావేశమై అధికారులెవరూ తమ అక్రమ వ్యాపారం వైపు కన్నెత్తి చూడకుండా ఏం చేయాలన్న అంశంపై ప్రణాళిక రూపొందించినట్లు సమాచారం. ఇటీవలే గుట్కా వ్యాపారులంతా అధికార పార్టీకి చెందిన ‘నేత’ను కలసి తమకు సహకరించాలని, అందుకు తమ సహాయ సహకారులుంటాయని స్పష్టం చేసినట్లు సమాచారం. ఒకటి, రెండు రోజుల్లో అధికార పార్టీ నేతను కలసి మరోసారి ఆశీస్సులు పొందాలని నిర్ణయించినట్లు సమాచారం.
అందరూ.. ‘గుట్కా’య స్వాహా!
Published Thu, Aug 18 2016 9:43 AM | Last Updated on Wed, Sep 26 2018 6:49 PM
Advertisement
Advertisement