
రూ.40 లక్షల విలువైన గుట్కా స్వాధీనం
రంగారెడ్డి జిల్లాలో భారీగా గుట్కా ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
రాజేంద్రనగర్ : రంగారెడ్డి జిల్లాలో భారీగా గుట్కా ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రాజేంద్రనగర్ మండలం హయాత్‌సాగర్‌లో శనివారం వేకువజామున హైదరాబాద్ రూరర్ విజిలెన్స్ పోలీసులు తనిఖీలు నిర్వహించారు.
ఈ తనిఖీల్లో రెండు లారీల్లో అక్రమంగా తరలిస‍్తున‍్న రూ.40 లక్షల విలువైన గుట్కా ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. లారీలతో పాటు డ్రైవర్లను స్టేషన్‌కు తరలించారు.