rs.40 lakhs
-
రూ.40 లక్షల విలువైన గుట్కా స్వాధీనం
-
రూ.40 లక్షల విలువైన గుట్కా స్వాధీనం
రాజేంద్రనగర్ : రంగారెడ్డి జిల్లాలో భారీగా గుట్కా ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రాజేంద్రనగర్ మండలం హయాత్సాగర్లో శనివారం వేకువజామున హైదరాబాద్ రూరర్ విజిలెన్స్ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో రెండు లారీల్లో అక్రమంగా తరలిస్తున్న రూ.40 లక్షల విలువైన గుట్కా ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. లారీలతో పాటు డ్రైవర్లను స్టేషన్‌కు తరలించారు. -
బుకీని బురిడీ కొట్టించిన మహిళ
రూ.40 లక్షలకు టోకరా ప్రొద్దుటూరు: ప్రొద్దుటూరుకు చెందిన ఒక క్రికెట్ బుకీని హైదరాబాద్‌కు చెందిన ఓ మహిళ రూ.40 లక్షలకు టోకరా వేసింది. పోలీసులు వస్తున్నారనే భయంతో తన వద్ద ఉన్న రూ.40 లక్షలను పక్కింట్లో ఉన్న మహిళకు ఇచ్చి తర్వాత తీసుకుంటానని చెప్పాడు. అయితే కొద్దిసేపటి తర్వాత క్రికెట్ బుకీ అక్కడికి వచ్చి డబ్బు బ్యాగ్ ఇవ్వమని అడుగగా ఏ బ్యాగ్ అని ఆమె చెప్పడంతో అతను తెల్లమొహం వేశాడు. దీంతో ఆ బుకీ రాజకీయ నాయకుల సహకారంతో పోలీసుల వద్ద పంచాయితీ పెట్టాడు. ఈ ఘటన మూడు రోజుల క్రితం హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో చోటు చేసుకుంది. విశ్వసనీయ సమాచారం మేరకు.. ప్రొద్దుటూరు పట్టణంలోని చాపల మార్కెట్ సమీపంలో నివాసం ఉంటున్న ఓ క్రికెట్ బుకీ తరచూ హైదరాబాద్‌లో ఉంటూ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తుంటాడు. ఐపీఎల్ మ్యాచ్‌లు జరుగుతుండటంతో అతను కొన్ని రోజుల నుంచి బంజారాహిల్స్ రోడ్ నెంబర్-2లోని ఇందిరానగర్‌లో ఉన్న అపార్ట్మెంట్లో ఉంటున్నాడు. పోలీసులు వస్తున్నారని .. మూడు రోజుల క్రితం ముగ్గురు వ్యక్తులు క్రికెట్ బుకీ ఉన్న అపార్ట్‌మెంట్‌కు వచ్చారు. వారిని సెక్యూరిటీ ప్రశ్నించడంతో పోలీసులమని చెప్పారు. ఈ క్రమంలోనే వారు తన గదికి వస్తున్నారనే సమాచారం తెలియడంతో క్రికెట్ బుకీ తన వద్ద ఉన్న రూ.40 లక్షలున్న బ్యాగ్‌ను పక్కనే ఉన్న ఇంట్లోకి విసిరి వేశాడు. ఇందులో రూ.40 లక్షలు ఉన్నాయని. తర్వాత వచ్చి తీసుకుంటానని ఇంట్లో ఉన్న మహిళకు చెప్పి పరారయ్యాడు. రెండు గంటల తర్వాత వచ్చి తన బ్యాగ్ ఇవ్వమని అడిగాడు. ఆమె ఏమీ తెలియనట్లు ఏం బ్యాగ్ అని ప్రశ్నించడంతో ఖంగుతున్నాడు. ఇప్పుడే కదా రూ.40 లక్షల నగదు ఉన్న బ్యాగ్ ఇచ్చి వెళ్లాను అని క్రికెట్ బుకీ చెప్పగా ఆమె తనకు ఎప్పుడిచ్చావని బదులు ఇవ్వడంతో అతను వెళ్లిపోయాడు. తర్వాత అతను స్థానికంగా ఉన్న కొందరి పరిచయస్తులతో పాటు రాజకీయ నాయకుల సహకారంతో పోలీసు అధికారి వద్ద పంచాయితీ పెట్టించినట్లు తెలిసింది. క్రికెట్ బుకీని బంగారు వ్యాపారస్తుడిగా చిత్రీకరించి పోలీసులకు ఫిర్యాదు చేయించినట్లు విశ్వసనీయ సమాచారం. కొంత మొత్తానికి సెటిల్మెంట్ చేసుకున్న పోలీసులు డబ్బు దోపిడీకి గురైందని కేసు నమోదు చేసినట్లు తెలిసింది. -
ఉద్యోగాల పేరుతో రూ.40 లక్షలకు టోపీ
హిమాయత్ నగర్ (హైదరాబాద్) : ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ నిరుద్యోగ యువకులను నమ్మించి రూ.40 లక్షల మేర మోసం చేసిన వ్యక్తి కటకటాల పాలయ్యాడు. ఇందుకు సంబంధించి నారాయణగూడ ఇన్స్పెక్టర్ భీమ్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరు జిల్లా గుళ్లపల్లి గ్రామానికి చెందిన కొత్త శ్రీనివాసరావు నగరంలోని న్యూ బాకారంలో నివాసం ఉంటున్నాడు. విలాసాలకు అలవాటు పడిన శ్రీనివాసరావు గత కొన్నేళ్లుగా ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలు విప్రో, టీసీఎస్, కాగ్నిజెంట్లలో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ గ్రామాల నుంచి వచ్చిన విద్యార్థులు, నిరుద్యోగులకు మాయమాటలు చెప్పి నమ్మించేవాడు. దీనికోసం నారాయణగూడలో 4 జాబ్ ప్లేస్మెంట్ కన్సల్టేన్సీలను కూడా ప్రారభించాడు. కొందరికి ఫేక్ ఆఫర్ లెటర్లు కూడా ఇచ్చాడు. ఇలా సుమారు 150 మంది నుంచి రూ.40 లక్షల మేర వసూలు చేసి ఆ డబ్బుతో జల్సాలు చేసేవాడు. ఎంతకీ అతడు ఉద్యోగాలు ఇప్పించకపోవడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. వారి ఫిర్యాదు మేరకు శ్రీనివాసరావును అదుపులోకి తీసుకుని 420, 406, 468, 471 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచారు. -
రూ. 40 లక్షలతో పట్టుబడ్డ వ్యక్తి
హైదరాబాద్: నగరంలోని నాంపల్లి రైల్వే స్టేషన్లో పోలీసులు మంగళవారం తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఓ వ్యక్తి నుంచి ఆధారాలు లేకుండా తీసుకుపోతున్న రూ. 40 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నగదుతోపాటు అతడిని పక్కనే ఉన్న రైల్వే పోలీసు స్టేషన్‌కు తరలించారు. కూకట్పల్లి నుంచి శబరి ఎక్స్‌ప్రెస్ ఎక్కేందుకు సదరు వ్యక్తి నాంపల్లి రైల్వే స్టేషన్‌కు వచ్చినట్లు పోలీసులు తెలిపారు. రెండు రోజుల క్రితం శబరి ఎక్స్‌ప్రెస్‌లో అక్రమంగా తరలిస్తున్న వెండిని పట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రైల్వే స్టేషన్లో తనిఖీలను పోలీసులు ముమ్మరం చేశారు. -
రూ.40లక్షల ఖైనీ పట్టివేత
భవానీపురం (విజయవాడ): గొల్లపూడి మార్కెట్ యార్డ్ సమీపంలోని ప్రగతి రోడ్డు క్యారియర్స్ గోడౌన్లో సుమారు కోటి రూపాయల విలువైన గుట్కాలను పట్టుకున్న కొద్ది రోజుల్లోనే గట్టు వెనుక సుమారు రూ.40 లక్షల విలువైన ఖైనీ ప్యాకెట్లను శనివారం భవానీపురం పోలీసులు పట్టుకున్నారు. మళ్లీ అదే ట్రాన్స్పోర్ట్కు చెందిన గోడౌన్లోనే ఈ సరుకు కూడా పట్టుబడడం విశేషం. గట్టు వెనుక ప్రాంతంలోని ఆర్టీసీ వర్క్షాపుదగ్గరగల బీరువాల కంపెనీ రోడ్డులో తెల్లవారు జామున 6.30కు ఒక గోడౌన్లో గుట్కాలను దిగుమతి చేస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. పోలీసులు అక్కడికి వెళ్లేసరికే ఒక లారీ దిగుమతి చేసి వెళ్లగా మరోలారీని పోలీసులు పట్టుకున్నారు. అంతకుముందు వెళ్లిన లారీనుంచి 200 ఖైనీ బస్తాలను దిగుమతి చేయగా, పోలీసులు పట్టుకున్న లారీలో మరో 100 బస్తాలు ఉన్నాయి. ఈ మొత్తం సరుకు దిగుమతి కాకముందే 30 బస్తాలు గోడౌన్లో ఉన్నాయి. మొత్తంమ్మీద రూ.40లక్షల విలువ చేసే 330 ఖైనీ బస్తాలను పట్టుకున్నారు. భవానీపురం ఎస్సై రామకృష్ణుడు జిల్లా ఫుడ్ ఇనస్పెక్టర్లు ఎ. శ్రీనివాస్, సుందరరామయ్యలకు, విద్యాధరపురం, భవానీపురం వీఆర్వోలు బి. శ్రీనివాస్, కామయ్యశాస్త్రిలకు సమాచారం అందించటంతో వారు అక్కడికి చేరుకున్నారు.సరుకును పరిశీలించి పంచనామా చేశారు. అనంతరం సరుకును గోడౌన్లోనే ఉంచి సీజ్ చేశారు. జేసీకి నివేదిక సమర్పిస్తాం ఫుడ్ ఇనస్పెక్టర్లు మాట్లాడుతూ కేసును నమోదు చేసి చార్జిషీట్‌ను ఫైల్‌చేసిన తర్వాత జాయింట్ కలెక్టర్‌కు నివేదికను సమర్పిస్తామని, ఆయన ఆదేశాల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇటీవల పట్టుబడిన కోటి రూపాయల సరుకుకూడా ఇదే ట్రాన్స్పోర్ట్ కార్యాలయంలో పట్టుకున్న నేపథ్యంలో ఆ సంస్థపై క్రిమినల్ కేసులు పెడతారా అన్న ప్రశ్నకు అది జేసీ నిర్ణయం మేరకు ఉంటుందన్నారు. ఢిల్లీ నుంచి ఒరిస్సాకు.. పోలీసులు పట్టుకున్న ఖైనీ లారీకి సంబంధించి డ్రైవర్ అందించిన వే బిల్లులో ఢిల్లీ నుంచి ఒడిశాకు లోడు వెళుతున్నట్లు ఉంది. జమ్మూ-కశ్మీర్ ఖతార్‌లోని ఎస్కే ఎంటర్‌ప్రజైస్ నుంచి ఒరిస్సాకు చెందిన గణేష్ ఎంటర్‌ప్రజైస్ అధినేత గణేష్ 200 బస్తాలు కొనుగోలు చేసినట్లు బిల్లులో ఉంది. -
కారు అద్దాలు పగలకొట్టి చోరీ
చెన్నై: కాంచీపురం సమీపంలోగల వ్యాపారి కారు అద్దాలను పగులగొట్టి, ఉద్యోగిపై దాడి చేసి 2.5 కిలోల బంగారాన్ని, రూ. 40 లక్షల నగదును గుర్తు తెలియని వ్యక్తులు దోచుకెళ్లారు. చెన్నై షావుకారుపేటకు చెందిన కమలేష్ (47). ఈయన నగల దుకాణాలకు బంగారు నగలను తయారు చేసి విక్రయిస్తుంటారు. సోమవారం ఉదయం 8గంటలకు ఆర్డర్ పేరిట వేలూరు, కాంచీపురంలోగల నగల దుకాణాలకు ఆరు కిలోల బంగారు నగలను అందజేసేందుకు తన వద్ద పని చేసే ఉద్యోగులు కాలూరన్ (30), రాజి (23)లకు నగలు ఇచ్చి పంపారు. వీరు నగలతో కారులో వేలూరుకు బయలుదేరారు. కారును చెన్నైకి చెందిన రవి నడిపాడు. వేలూరు, ఆర్కాడులోని నగల దుకాణాల్లో 3.5 కిలోల బంగారు నగలను ఇచ్చి దీనికి సంబంధించిన నగదు రూ.40 లక్షలను తీసుకున్నారు. ఆ తరువాత సోమవారం సాయంత్రం కాంచీపురంలో గల ఒక నగల దుకాణానికి వచ్చారు. అక్కడ యజమాని లేకపోవడంతో రెండు గంటల సేపు వేచి చూశారు. అక్కడ ఆలస్యం కావడంతో రాత్రి 8 గంటలకు నగలతో చెన్నైకి బయలుదేరారు. కాంచీపురం నుంచి చెన్నై-బెంగళూరు జాతీయ రహదారిపై కారు వస్తుండగా ఏనాత్తూరు అనే గ్రామంలో రోడ్డు పక్కన కారును నిలిపి అక్కడున్న టీ బంకు దగ్గరకు వెళ్లారు. ఆ సమయంలో అక్కడకు వచ్చిన కారు, నగలు గల కారు పక్కనే నిలిచింది. హఠాత్తుగా కారులో వున్న వ్యక్తులు వేటకొడవళ్లు, దుడ్డుకర్రలతో కిందకు దిగారు. నగలు వున్న కారు అద్దాలను ధ్వంసం చేశారు. దీన్ని గమనించిన నగల దుకాణం ఉద్యోగులు దిగ్భ్రాంతి చెందారు. వెంటనే కారులో వున్న 2.5 కిలోల బంగారు నగలను, *40 లక్షల నగదును దొంగలు దోచుకెళ్లారు. దీన్ని అడ్డుకోవడానికి వచ్చిన ఉద్యోగి కాలూరన్పై దాడి చేసి పరారయ్యారు. సమాచారం అందుకున్న కాంచీపురం తాలూకా పోలీసులు సంఘటనా స్థలం చేరుకున్నారు. జిల్లా ఎస్పీ విజయకుమార్, డీఎస్పీ బాలచందర్ విచారణ జరిపారు. పోలీసులు అన్ని మార్గాల్లో ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు. దోపిడీ దొంగలను పట్టుకునేందుకు అధికారులు రెండు పోలీసు బృందాలను ఏర్పాటు చేశారు.