గుట్కాప్యాకెట్ల స్వాధీనం | Possession Of Gutka Packets | Sakshi
Sakshi News home page

గుట్కాప్యాకెట్ల స్వాధీనం

Published Wed, Mar 28 2018 11:54 AM | Last Updated on Wed, Sep 26 2018 6:49 PM

Possession Of Gutka Packets - Sakshi

వివరాలు వెల్లడిస్తున్న డీఎస్పీ

మిర్యాలగూడ అర్బన్‌ : మిర్యాలగూడ డివిజన్‌లో పోలీసులు భారీగా గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం పట్టణంలోని టూటౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసు వివరాలను డీఎస్పీ శ్రీనివాస్‌ వెల్లడించారు. పట్టణంలోని ఇస్లాంపుర వద్ద టూటౌన్‌ పోలీసులు తనిఖీలు చేస్తుండగా గుట్కా ప్యాకెట్లను తరలిస్తూ పోలీసులకు తారసపడ్డారు. వారి వద్ద నుంచి స్వాధీనం చేసుకున్న గుట్కా ప్యాకెట్ల విలువ సుమారు రూ.1.60లక్షలు ఉంటుందని తెలిపారు.   అదేవిధంగా మాడుగులపల్లి స్టేషన్‌ పరిధిలో తనిఖీలు చేయగా గుట్కా ప్యాకెట్లు దొరికాయి. వీటివిలువ రూ.3లక్షలు ఉంటుందన్నారు. ఈ ఘటనలో మిర్యాలగూడకు చెందిన  ఎండి.ఫరూక్, గంధం వెంకటేశ్వర్లు, గంగవరం శేఖర్, గుండా కృష్ణ, మాడుగులపల్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో పుచ్చకాయలగూడెంనకు చెందిన రాపాక శ్రీను, బుర్ల లింగయ్యలను అరెస్ట్‌ చేసి వారి వద్దనుంచి ఒక కారు,  రెండు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో మిర్యాలగూడ టూటౌన్, రూరల్‌ సిఐ లు సాయి ఈశ్వర్‌గౌడ్, రమేష్‌బాబు, ఎస్‌ఐలు సురేష్‌గౌడ్, శేఖర్‌ పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement