miryalaguada
-
ఆరెంజ్ ట్రావెల్స్ బస్సు బోల్తా
సాక్షి, నల్లగొండ: మిర్యాలగూడ వద్ద శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. హై స్పీడ్‌తో వెళ్తున్న ఆరెంజ్ ట్రావెల్స్ బస్సు అద్దంకి-నార్కట్‌పల్లి రహదారిపై హనుమాన్‌పేట బైపాస్ వద్ద అదుపు తప్పి బోల్తా పడింది. ప్రమాద సమాచారం అందిన వెంటనే ఘటన స్థలానికి టూ టౌన్ పోలీసులు చేరుకున్నారు. ఈ ప్రమాదంలో ఎనిమిది మందికి తీవ్ర గాయాలు కాగా.. వారిని మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రికి తరలించారు. అయితే, 27 మంది ప్రయాణికులతో బస్సు.. హైదరాబాద్ నుండి బాపట్ల వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదానికి డ్రైవర్ అతివేగమే కారణమని పోలీసులు ప్రాథమికంగా అంచనా వేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. -
అలర్ట్: జిల్లాలో ఒకే రోజు ఆరుగురికి కరోనా..
సాక్షి నల్లగొండ : నల్లగొండ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. జిల్లా తొలిసారిగా ఒక్కరోజే ఆరుగురు వ్యక్తులకు కరోనా సోకినట్లు తేలడం సంచలనం సృష్టించింది. రెండు రోజుల కిందట జిల్లా కేంద్రంనుంచి నిజాముద్దీన్ మర్కజ్‌కు వెళ్లివచ్చిన వారిలో 44మందిని పరీక్షలకు పంపించగా వారిలో 37మంది ఫలితాలు వచ్చాయి. వీరిలో నల్లగొండ పట్టణంలోని ఐదుగురికి, మిర్యాలగూడలో ఒకరికి కరోనా (కోవిడ్ –19) వైరస్ సోకినట్లు (పాజిటివ్) అని తేలింది. కాగా, బుధవారం మరో 17మంది బర్మా దేశస్తులను పరీక్షల కోసం తరలించారు. అంటే మరో 24 మంది రిపోర్టులు అందాల్సి ఉంది. కాగా, కరోనా పాజిటివ్ రిపోర్టు వచ్చిన ఆరుగురిని హైదరాబాద్ క్వారంటైన్లో ఉంచారు. నెగిటివ్ వచ్చిన వారిని నల్లగొండ మహాత్మాగాంధీ యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన క్వారంటైన్ సెంటర్లో ఉంచారు. పాజిటివ్ వచ్చిన వారి కుటుంబ సభ్యులకూ పరీక్షలు మర్కజ్ వెళ్లి వచ్చి కరోనా వైరస్ బారిన పడిన ఆరుగురు వ్యక్తులకు చెందిన 39మంది కుటుంబ సభ్యులను పోలీసులు, వైద్యాధికారులు గురువారం నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రిలోని క్వారంటైన్‌కు తరలించారు. ఉదయం 5.30 గంటల ప్రాంతంలో పోలీసులు, వైద్య సిబ్బంది వెళ్లి 15 వాహనాల్లో వారందరినీ తీసుకొచ్చారు. వారినుంచి రక్తనమూనాలు సేకరించి సీసీఎంబీకి పంపించినట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కొండల్రావు తెలిపారు. నల్లగొండ పట్టణంలో కరోనా పాజిటివ్ వచ్చిన ఐదుగురు వ్యక్తుల నివాస ప్రాంతాలను జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్‌పాటిల్, ఎస్పీ ఏ.వి.రంగనాథ్, ఇతర అధికారులు పరిశీలించారు. నల్లగొండ : కరోనా పాజిటివ్ బాధితుల ఇళ్ల వద్ద పరిస్థితిని సమీక్షిస్తున్న కలెక్టర్, ఎస్పీ, అధికారులు ప్రజాప్రతినిధులు, మతపెద్దలతో సమావేశం కరోనా వైరస్ పాజిటివ్ కేసులు రావడంతో జిల్లా యంత్రాంగం మరింత అప్రమత్తమైంది. జనతా కర్ఫ్యూనుంచి కరోనా వ్యాప్తి నివారణ కోసం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటూనే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కలెక్టర్, ఎస్పీలు అధికారులకు ఆదేశాలు ఇవ్వడంతోపాటు స్వయంగా పర్యటనలు చేస్తూ, పరిశీలిస్తూ వస్తున్నారు. నిజాముదీ్దన్ మర్కజ్ ధార్మిక కార్యక్రమానికి వెళ్ల్విచి్చన వారు రాష్ట్రంలో ఆరుగురు మృతి చెందడంతో జిల్లా అధికారులు అలెర్ట్ అయ్యారు. జిల్లానుంచి నిజాముద్దీన్ వెళ్లొచ్చిన వారిని గుర్తించారు. వీరిలోనే ఆరుగురికి కరోనా వైరస్ సోకింది. నల్లగొండలోని ఐదుగురు, మిర్యాలగూడలోని ఒకరి నివాస ప్రాంతాల్లో చేపట్టాలేన కట్టుదిట్టమైన చర్యలు తీసుకునేందుకు ఆయా కౌన్సిలర్లు , మతపెద్దలతో సమీ క్షించేందుకు జిల్లా కలెక్టర్టేట్లో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ ప్రాంతాల్లో పూర్తి లాక్‌డౌన్‌ను అమలు చేయాలని నిర్ణయించారు. ఆ ప్రాంతాలను పూర్తిగా మూసివేసేలా బారికేడ్లను ఏర్పాటు చేయాలని పోలీసులు నిర్ణయించారు. ఆయా ప్రాంతాల్లోని నివాసితులకు అవసరమైన సరుకులు ప్రభుత్వ యంత్రాంగమే అందించేలా చర్యలు తీసుకోనున్నారు. వైరస్ సోకిన వారి కాలనీలను రెడ్జోన్లుగా ప్రకటించే అవకాశం ఉందని చెబుతున్నారు. నార్కట్‌పల్లి మండలంలో భయాందోళన మరోవైపు నార్కట్‌పల్లి మండలంలోనూ భయాందోళనలు నెలకొన్నాయి. కరోనా వైరస్ సోకిన ఆరుగురిలో నల్లగొండకు చెందిన ఓ వ్యక్తి నార్కట్‌పల్లి మండలం మాండ్ర ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. ఎస్సెస్సీ పరీక్షలకు ఆయన ఇన్విజిలేటర్‌గా గత నెల 19, 20, 21తేదీల్లో విధులు నిర్వహించారు. మాండ్ర పరీక్ష కేంద్రంలో రెండువందల మందిదాకా వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు ఎస్సెస్సీ పరీక్షలకు హాజరయ్యారు. వీరితోపాటు పన్నెండు మంది దాకా ఉపాధ్యాయులు విధులకు హాజరయ్యారు. దీంతో వీరందరినీ గుర్తించే పనిలో జిల్లా విద్యాశాఖ నిమగ్నమైంది. చికిత్స అందించిన వైద్యుడికి అస్వస్థత? మిర్యాలగూడ అర్బన్ : మిర్యాలగూడకు చెందిన వ్యక్తి నిజాముదీ్దన్ మర్కజ్ వెళ్లి వచ్చాక ఒక విందు ఏర్పాటు చేశారని ప్రచారం జరుగుతోంది. ఆ వేడుకకు ఎవరెవరు హాజరయ్యారనే విషయాన్ని తెలుసుకునే పనిలో అధికార యంత్రాంగం ఉంది. ఢిల్లీ నుంచి వచిన తరువాత సదరు మహిళ జలుబు, దగ్గుతో పట్టణంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రి వైద్యుడి వద్ద చికిత్స చేయించుకున్నట్లు తెలిసింది. ఆ వైద్యుడు సైతం అస్వస్థతకు గురి కావడంతో హైదరాబాద్‌లో వైద్యపరీక్షలు చేయంచుకుని స్థానికంగా క్వారంటైన్లో ఉన్నాడనే ప్రచారం జరుగుతుంది. పాజిటివ్ వచ్చిన వారితో కలిసిన వారు ఎవరైనా ఉంటే వెంట నే వైద్య పరీక్షలు చేయంచుకుని అధికారులకు సహకరించాలని సీఐ దొంతిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ కేశా రవి కోరారు. -
మారుతీరావు ఆస్తుల చిట్టా ఇదే..!
సాక్షి, నల్గొండ: మిర్యాలగూడ ప్రణయ్ హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న మారుతీరావు ఆస్తుల వివరాలను మంగళవారం పోలీపులు కోర్టుకు సమర్పించారు. కాగా ఆదివారం హైదరాబాద్‌లో ఆర్యవైశ్య భవన్లో ఆయన ఆత్మహత్య చేసుకుని మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సోమవారం రోజున మిర్యాలగూడలో ఆయన అంత్యక్రియలు ముగిశాయి. ఈ నేపథ్యంలో ఆయన మృతిపై పోలీసులు దర్యాప్తు వేగవంతం చేయగా.. ఆయనకు సంబంధించిన ఆస్తుల వివరాలు బయటకు పడ్డాయి. చదవండి: డ్రైవర్ని ఆ షాప్ వద్ద కారు ఆపమన్న మారుతీరావు బహిరంగ మార్కెట్ విలువ ప్రకారం.. మారుతీరావు ఆస్తులు రూ. 200 కోట్లు ఉంటాయని వెల్లడించారు. మొదట కిరోసిన్ వ్యాపారం చేసిన మారుతీరావు.. ఆ తర్వాత రైస్ మిల్లుల వ్యాపారంలోకి అడుగుపెట్టాడు. 15 ఏళ్ల క్రితం రైస్ మిల్లులను అమ్మి రియల్ ఎస్టేట్ బిజినెస్ ప్రారంభించారు. ఈ క్రమంలో గ్రీన్‌హోమ్స్ పేరుతో 100 విల్లాలను అమ్మాడు. ఇక మిర్యాలగూడలో కూతురు అమృత పేరిటా 100 పడకల ఆసుపత్రిని నిర్మించారు. ఆయన భార్య గిరిజా పేరు మీద 10 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. చదవండి: 'అమృత అంటే మారుతీరావుకు చచ్చేంత ప్రేమ' అంతేగాక మిర్యాలగూడ బైపాస్‌లో 22 గుంటల భూమి, హైదరాబాద్ కొత్తపేటలో 400 గజాల స్థలం, ఈదులగూడ ఎక్స్‌రోడ్‌లో షాపింగ్ మాల్స్‌తో పాటు ఆయన తల్లి పేరు మీద రెండతస్తుల షాపింగ్‌మాల్ కూడా ఉంది. దామరచర్ల శాంతినగర్‌లో 20 ఎకరాల పట్టా భూమి, ఆయన పేరు మీద సొంతంగా 6 ఎకరాల భూమితో పాటు, సర్వే నెం 756తో మిర్యాలగూడలో ఎకరం 2గుంటల భూమి ఉంది. ఇక హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో 5 అపార్టుమెంట్లు ఉన్నట్లు పోలీసులు కోర్టుకు వివరాలు సమర్పించారు. -
యువ రైతు... నవ సేద్యం!
సాక్షి, మిర్యాలగూడ : చదివింది సాంకేతిక విద్య.. పుడమిని నమ్ముకున్న తండ్రికి చేదోడు వాదోడుగా ఉంటూ గత కొంత కాలంగా సేంద్రియ వ్యవసాయం పై ప్రత్యేక దృష్టిని సారించాడు. మధ్యప్రదేశ్‌లో చేస్తున్న తాను చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేసి సేంద్రియ వ్యవసాయం చేస్తూ రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. ఆయనే మద్దెల అరుణ్. మిర్యాలగూడ పట్టణంలోని మద్దెల గౌతమ్–విమలకు ముగ్గురు సంతానం, వీరు ఇరువురు ఉద్యోగులే. మద్దెల గౌతమ్ హాస్టల్ వార్డెన్‌గా పని చేస్తుండగా.. విమల ఉపాధ్యాయురాలుగా పనిచేసి పదవి వీరమణ పొందారు. మద్దెల అరుణ్ ఎంటెక్ కంప్యూటర్ సైన్స్‌ను పూర్తి చేశాడు. కాగా నల్లగొండలో శ్రీరామానంద తీర్థ ఇంజనీరింగ్ కళాశాలలో ఏడాది పాటు అధ్యాపకుడిగా పనిచేశాడు. ఆ తరువాత నల్లగొండ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్‌లో మరో ఏడాది పాటు పని చేశాడు. ఆ సమయంలోనే అరుణ్‌కు మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ నగరంలోని లక్ష్మీనారాయణ కళాశాల అండ్ టెక్నాలజీ (ఎల్ఎన్సీటీ)లో రూ. 50వేల వేతనంపై అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పని చేశాడు. ఈ క్రమంలో వ్యవసాయంలో తండ్రి గౌతమ్‌కు ఆసరగా ఉండేందుకు వ్యవసాయం చేయాలనే తపనతో 2013లో తన అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగానికి రాజీనామా చేశాడు. సాధారణ పద్ధతులతో వ్యవసాయం సాగు చేస్తే సాగుబడి ఖర్చు పెరుగుతుంది కాని ఎలాంటి ఫలితం లేదని గుర్తించి వ్యవసాయ అధికారుల సలహాలు, సూచనల మేరకు సేంద్రియ సాగుపై ప్రత్యేక దృష్టి సారించాడు. పట్టణ శివారులో ఉన్న అద్దంకి–నార్కట్‌పల్లి బైపాస్ రోడ్డులో గల ఖలీల్ దాబా వెనుకాలో 10 ఎకరాల్లో సేంద్రియ పద్ధతుల్లో వరి సాగు చేస్తున్నాడు. అందుకు గాను మండల వ్యవసాయ అధికారులు, కృషి విజ్ఞాన్ కేంద్రం శాస్త్రవేత్తలు, తక్కువ పెట్టబడితో ఎక్కువ అధిక దిగుబడిని సాధిస్తున్న రైతుల సలహాలు తీసుకొని సేంద్రియ వరిసాగును చేపట్టాడు. మొదటి పంటలో 20 బస్తాలను పండించగా, గత రబీ సీజన్లో 34బస్తాల వరి ధాన్యాన్ని పండించాడు. ప్రస్తుతం సేంద్రియ పద్ధతిలోనే వరిని సాగు చేస్తున్నాడు. క్షేత్రంలోనే ఎరువుల తయారీ.. అద్దంకి–నార్కట్‌పల్లి బైపాస్ రోడ్డు వెంట ఉన్న ఖలీల్ దాబా వెనుకాల ఒక షెడ్‌ను ఏర్పాటు చేసుకొని భూసారాన్ని పెంచేందుకు తెగుళ్ల నివారణ, పంటలకు అవసరమైన పోషణలకు తన వ్యవసాయ క్షేత్రం పక్కనే సేంద్రియ ఎరువులను తయారు చేస్తున్నాడు. నాణ్యమైన దిగుబడితో పాటు, పెట్టుబడి తక్కువ అని పేర్కొంటున్నాడు. ఎరువుల తయారీ ఆయన మాటల్లోనే.. జీవన, దృవ, ఘన జీవంలో ఆవుపేడ, ఆవు మూత్రం, ఏదైనా పిండితో కలిపి బెల్లం రెండు కేజీలు, పుట్టమన్ను రెండు కేజీలు, 200 లీటర్ల నీటితో నాలుగు రోజుల పాటు మరుగుపెట్టాల్సి ఉంటుంది. ఆ తరువాత పొలాల్లో చల్లితే యూరియా, అడుగుపిండి అవసరం లేదు. దీనిని వరి పంటలో 15 రోజులకు ఒక్కసారి వేయాల్సి ఉంటుంది. అదే విధంగా వీటిన్నింటి ఆవుపేడతో కలిపి ముద్దలుగా పిడకలను చేసి నిల్వ ఉంచాలి. ఆ తరువాత దీని పంటలకు పెంట దిబ్బలను తోలే సమయంలో ఈ ముద్దలను కలిపితే మరింత బలంగా ఉంటుంది. ఇలా పచ్చిరొట్టె, పైర్లు, వేపపిండి, ఘన జీవామృతం, జీవ ఎరువుల అజోల స్పెరిలం, పొటాష్ పప్పోసాల్‌బాయిల్ బ్యాక్టీరియా, వర్మీకంపోస్ట్, విత్తన శుద్ధికి బీజామృతం తయారీ, పురుగుల మందు నివారణకు జీవామృతం తయారీ చేయాలి. అంతేకాకుండా సేంద్రియ వ్యవసాయంలో ఫలితం పొందుతున్న యువ రైతు వ్యవసాయ శాఖ అధికారులు ఏర్పాటు చేసే సదస్సుల్లో సేంద్రియ వ్యవసాయంపై అవగాహన కల్పిస్తున్నారు. ప్రస్తుతం వర్మీకంపోస్టు తయారు చేసేందుకు అవసరమైన ఏర్పాట్లను చేపడుతున్నాడు. అదే విధంగా సుమారు 20 గేదెలు, ఆవులతో మంచి పాల వ్యాపారంతో పాటు సొంత డెయిరీని కూడా నడుపుకుంటున్నాడు. తక్కువ ఖర్చు.. ఎక్కువ దిగుబడి.. మద్దెల అరుణ్ సేంద్రియ ఎరువులపైనే ప్రత్యేక దృష్టిని సారించి తనదైన శైలిలో వ్యవసాయాన్ని చేస్తున్నాడు. సాధారణ పద్ధతిలో ప్రస్తుత పరిస్థితుల్లో తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడిని సాధించాలనే లక్ష్యంతో ముందడుగు వేస్తున్నాడు. అయితే ఎకరానికి రూ. 15వేల నుంచి రూ. 20వేల వరకు ఖర్చు అవుతుండగా సేంద్రియ పద్ధతిలో రూ. 10వేల నుంచి రూ. 12వేల వరకు పెట్టుబడి అవుతుంది. సేంద్రియ పద్ధతిలో పండించిన పంటలకు బహిరంగ మార్కెట్లలో మంచి స్పందన లభిస్తుందని ఆయన పేర్కొంటున్నాడు. వేములపల్లి మండలంలో 10 ఎకరాలు, మిర్యాలగూడ బైపాస్‌లో 10 ఎకరాలతో పాటు మరో 6 ఎకరాలను కౌలుకు తీసుకొని వరిసాగును చేపడుతున్నాడు. -
దేశ రాజకీయాల్లోకి జాతీయ పార్టీగా వెళ్తా: కేసీఆర్
సాక్షి, నల్గొండ: సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి 150 సీట్లు, కాంగ్రెస్ పార్టీకి 100 సీట్లు కూడా రావని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అభిప్రాయపడ్డారు. ఎన్నికల తరువాత జాతీయ స్థాయిలో ప్రాంతీయ పార్టీలదే హవా ఉంటుందని, ఆ పార్టీలే కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయని స్పష్టం చేశారు. దేశ భద్రత సంబంధించిన విషయాలను ప్రధాని నరేంద్ర మోదీ ప్రచారంగా ఉపయోగించుకుంటున్నారని మండిపడ్డారు. ఓట్ల కోసమే హిందూవులంటూ రెచ్చగొడుతున్నారని, ఎన్నికల అనంతరం బీజేపీకి శంకరగిరిమాన్యాలే అని ఎద్దేవా చేశారు. బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని, ఒళ్లు దగ్గరపెట్టుకోవాలని కేసీఆర్ హెచ్చరించారు. ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రానికి వచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని, అందుకే బీజేపీకి 119 స్థానాల్లో పోటీచేస్తే.. కేవలం ఒకేఒక్క స్థానంలో గెలుపొందారని గుర్తుచేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నల్గొండ జిల్లా మిర్యాలగూడెంలో జరిగిన టీఆర్ఎస్ బహిరంగ సభలో కేసీఆర్ ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ.. దేశంలోనే అతిపెద్ద ఆల్ట్రామెగా విద్యుత్ ప్లాంట్‌ను 29వేల కోట్లతో దామరచర్లలో నిర్మిస్తున్నామని తెలిపారు. టీఆర్ఎస్ చేస్తున్న అభివృద్ధిని చూసి జిల్లాలో తొమ్మిది అసెంబ్లీ స్థానాలకు గెలిపించారని పేర్కొన్నారు. భవిష్యత్తులో నల్గొండను మరింత అభివృద్ధి చేస్తామని, దాంతో ఈజిల్లా ముఖచిత్రమే పూర్తిగా మారనుందని స్పష్టం చేశారు. కోమటి రెడ్డి వెంకట్‌రెడ్డి, ఉత్తమ్ కుమార్‌రెడ్డికి బుద్ధి చెప్పాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఈజిల్లాలో టీఆర్ఎస్ ఒక్కస్థానం గెలిచిన రాజకీయ సన్యాసం చేసుకుంటానని కోమటిరెడ్డి ప్రకటించారని.. మళ్లీ ఎందుకు పోటీ చేస్తున్నారని ప్రశ్నించారు. ఇన్నేళ్లు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ ఏం అభివృద్ధి చేసిందో ఉత్తమ్, రాహుల్ చెప్పాలని డిమాండ్ చేశారు. టికెట్లు అమ్ముకునే సంస్కారం కాంగ్రెస్ నేతలదని, అందుకే అందరూ రాజీనామాలు చేసి తమ పార్టీలో చేరుతున్నారని వెల్లడించారు. ఎన్నికల అనంతరం ఉత్తమ్ కుమార్ రెడ్డి పదవి పోవడం ఖాయమన్నారు. దేశంలో గుణాత్మక మార్పు కోసం అవసరమైతే జాతీయ పార్టీని కూడా పెడతానని కేసీఆర్ ప్రకటించారు. సమాఖ్య కూటమి వస్తేనే దేశంలో మార్పు సాధ్యమన్నారు. లోక్‌సభ ఎన్నిలకల్లో 16 ఎంపీ స్థానాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. కారు గుర్తుకు ఓటు వేసి నల్గొండ ఎంపీగా పోటీచేస్తున్న వేమిరెడ్డి నర్సింహారెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కేసీఆర్ కోరారు. -
ముగ జీవాల మృత్యువాత
మిర్యాలగూడ రూరల్ : పాలమూరు జిల్లా గొర్రెల మందను మృత్యు వీడడం లేదు. మూడు నెలల క్రితం నల్లగొండ జిల్లాలోని సాగర్ ఆయకట్టుకు వేసవిలో మేత కోసం11 మంది యజమానులు తమకున్న 3000 గొర్రెలతో బయలుదేరారు. వారు శుక్రవారం మిర్యాలగూడ మండలం తుంగపహాడ్ గ్రామ శివారుకు చేరుకున్నారు. అక్కడ మందలోని గొర్రెలు అనారోగ్యనికి గురై 60 గొర్రెలు మృత్యువాత పడ్డాయి. విషయం తెలుసుకున్న మిర్యాలగూడ పశు సంవర్థకశాఖ సిబ్బంది పశు వైద్యులు చికిత్స అందింస్తున్నప్పటికీ గొర్రెల మరణాన్ని అరికట్టే పరిస్థితి లేకపోయింది. æ రెండవ రోజు శనివారం మరి 31గొర్రెలు మృతిచెందాయి. రక్త నమూనాలు, శరీరంలో భాగాల ముక్కలు షాంపిల్స్ హైదరాబాద్ వెటర్నరీ బయోజికల్ ల్యాబ్‌కు పంపించారు. వాటి ఫలితాలు రావాలంటే కనీసం 48 గంటలు పడుతుందని వైద్య సిబ్బంది పేర్కొన్నారు. కాగా నల్లగొండకు పంపిన ల్యాబ్ టెస్ట్ ఫలితాల ప్రకారం విష ఆహారం, అజీర్ణ సమస్యతో పాటు చిటక రోగం, పుర్రు రోగం సోకినట్లు మిర్యాలగూడ ఏడీ వెంకట్‌రెడ్డి తెలిపారు. కొనసాగుతున్న వైద్యశిబిరం మిర్యాలగూడ , త్రిపురారం వెటర్నరీ వైద్య బృదం గొర్రెలకు చికిత్స అందస్తున్నారు. వ్యాధి నిరోధక మందులు, సెలెన్ అందిస్తున్న కంట్రోలు కాకపోవడంతో ఇటు వైద్యులు, అటు గొర్రెలు మందల యజమానులు అందోళన చెందుతున్నారు. కానరాని స్పందన కాగా నాలుగు రోజులుగా గొర్రెలు నిరంతరం మరణిస్తున్నప్పటికీ అధికారులెవరూ స్పందించక పోవడం బాధాకరం. గొర్రెలనే నమ్ముకుని జీవ నం సాగిస్తూ జిల్లా దాటి వచ్చి ఇక్కడ అకస్మాత్తుగా జీవాలు మృతి చెందుతుండడంతో కాపరులు ఏమి పాలుపోక ఆందోళన చెందుతున్నారు. -
గుట్కాప్యాకెట్ల స్వాధీనం
మిర్యాలగూడ అర్బన్ : మిర్యాలగూడ డివిజన్లో పోలీసులు భారీగా గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం పట్టణంలోని టూటౌన్ పోలీస్ స్టేషన్లో కేసు వివరాలను డీఎస్పీ శ్రీనివాస్ వెల్లడించారు. పట్టణంలోని ఇస్లాంపుర వద్ద టూటౌన్ పోలీసులు తనిఖీలు చేస్తుండగా గుట్కా ప్యాకెట్లను తరలిస్తూ పోలీసులకు తారసపడ్డారు. వారి వద్ద నుంచి స్వాధీనం చేసుకున్న గుట్కా ప్యాకెట్ల విలువ సుమారు రూ.1.60లక్షలు ఉంటుందని తెలిపారు. అదేవిధంగా మాడుగులపల్లి స్టేషన్ పరిధిలో తనిఖీలు చేయగా గుట్కా ప్యాకెట్లు దొరికాయి. వీటివిలువ రూ.3లక్షలు ఉంటుందన్నారు. ఈ ఘటనలో మిర్యాలగూడకు చెందిన ఎండి.ఫరూక్, గంధం వెంకటేశ్వర్లు, గంగవరం శేఖర్, గుండా కృష్ణ, మాడుగులపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో పుచ్చకాయలగూడెంనకు చెందిన రాపాక శ్రీను, బుర్ల లింగయ్యలను అరెస్ట్ చేసి వారి వద్దనుంచి ఒక కారు, రెండు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో మిర్యాలగూడ టూటౌన్, రూరల్ సిఐ లు సాయి ఈశ్వర్‌గౌడ్, రమేష్‌బాబు, ఎస్ఐలు సురేష్‌గౌడ్, శేఖర్ పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో వేములపల్లి ఏఎస్ఐ మృతి
సాక్షి, మిర్యాలగూడ: మిర్యాలగూడ ఏడుకోట్ల తండా వద్ద మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏఎస్ఐ మృతిచెందారు. మంచు కారణంగా దారి కనిపించక ఆగిఉన్న లారీని ద్విచక్రవాహనం ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ సంఘటనలో ద్విచక్రవాహనంపై వెళుతున్న వేములపల్లి ఏఎస్ఐ మస్తాన్అలీ తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు హుటాహుటిన మిర్యాలగూడ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మస్తాన్అలీ మృతి చెందారు. విధులు ముగించుకుని వేములపల్లి నుంచి మిర్యాలగూడ వెళ్తుండగా ప్రమాదం జరిగింది. మస్తాన్అలీ సూర్యపేట జిల్లా నేరేడుచర్ల మండలం సోమారం గ్రామానికి చెందినవారు. -
రాష్ట్రస్థాయి బాల్‌బ్యాడ్మింటన్ చాంపియన్‌గా జిల్లా జట్టు
నిజామాబాద్ స్పోర్ట్స్ : స్కూల్‌గేమ్స్ ఫె డరేషన్ అండర్–19 బాలబాలికల బాల్‌బ్యాడ్మింటన్ రాష్ట్రస్థాయి టోర్నీలో జిల్లా బాలబాలికల జట్లు విజేతలుగా నిలిచి చాంపియన్‌ను కైవసం చేసుకున్నాయి. ఈనెల 10 నుంచి 12వ తేదీ వరకు న ల్గొండ జిల్లాలోని మిర్యాలగూడలో టో ర్నీ జరిగింది. ఇందులో బాలబాలికల జ ట్లు విజేతగా నిలిచాయి. బాలుర జట్టు లో ఉప్పల్వాయి గురుకుల విద్యార్థులు, బాలికల జట్టులో మొత్తం సుద్దపల్లి, కం జర విద్యార్థినులు ఉన్నారు. ప్రత్యేకంగా అభినందించిన కలెక్టర్ రాష్ట్రస్థాయిలో జిల్లాను చాంపియన్‌గా నిలిపిన క్రీడాకారులను కలెక్టర్ డాక్టర్ యోగితారాణా గురువారం తన చాంబ ర్లో ప్రత్యేకంగా అభినందించారు. బా లబాలికల జట్ల కెప్టెన్లతో, పీడీ నాగేశ్వర్‌తో మాట్లాడారు. జిల్లాను రాష్ట్రస్థాయి లో ప్రథమస్థానంలో నిలిపినందుకు, ఇందుకు కృషిచేసిన ప్రిన్సిపాల్స్, కోచ్‌ల ను అభినందించారు. మరిన్ని విజయా లు సాధిస్తూ జిల్లాకు, రాష్ట్రానికి మంచి పేరుప్రఖ్యాతలు తీసుకురావాలన్నారు. కార్యక్రమంలో అండర్–19 ఎస్జీఎఫ్ కార్యదర్శి ఎండీ షకీల్, డీసీవో సాయినా థ్, సుద్దపల్లి, కంజర ప్రిన్సిపాల్స్ సరోజినాయుడు, సింధు, ఉప్పల్వాయి పీడీ నాగేశ్వర్రావు, నర్మద, దేవలక్ష్మి, నీరజ, జోత్య్స, ఎన్.కృష్ణ, క్రీడాకారులు పాల్గొన్నారు. లంచ్ చేయించకుండా జారుకున్న డీసీవో క్రీడాకారులకు లంచ్ చేయించాలని గు రుకులాల జిల్లా కో–ఆర్డినేటర్ సాయినాథ్‌ను కలెక్టర్ ఆదేశించారు. కలెక్టర్ చాంబర్ నుంచి బయటకు వచ్చిన కోద్దిసేపటికి కో–ఆర్డినేటర్ ఎవరికీ చెప్పకుండా జారుకున్నాడు. దీంతో సుద్దపల్లి ప్రిన్సిపాల్, పీడీలు కో–ఆర్డినేటర్‌కు ఫోన్ చేయగా స్పందించలేదు. కలెక్టర్ సీసీ రామును కలిసి విషయం తెలిపారు. సీసీ కలెక్టర్ అనుమతితో మెస్‌లో అందరికీ లంచ్ చేయించారు. జాతీయస్థాయికి ఎంపికైన క్రీడాకారులు రాష్ట్రస్థాయిలో ప్రతిభ చూపి విజేతలుగా నిలిచిన జట్ల నుంచి జాతీయస్థాయికి పలువురు క్రీడాకారులు ఎంపియ్యారు. బాలుర జట్టులో ఆర్.అనిల్‌కుమార్, పి.సాయికుమార్, సీహెచ్.మహేశ్(ఉప్పల్వాయి)లు ఎంపిక కాగా, బాలికల జట్టులో లిఖిత, అలేఖ్య(సుద్దపల్లి), ప్రత్యూష(కంజర)లు ఎంపికయ్యారు.