రాష్ట్రస్థాయి బాల్‌బ్యాడ్మింటన్ చాంపియన్‌గా జిల్లా జట్టు
రాష్ట్రస్థాయి బాల్‌బ్యాడ్మింటన్ చాంపియన్‌గా జిల్లా జట్టు
Published Fri, Sep 16 2016 12:26 AM | Last Updated on Sat, Sep 15 2018 5:21 PM
నిజామాబాద్ స్పోర్ట్స్ : స్కూల్‌గేమ్స్ ఫె డరేషన్ అండర్–19 బాలబాలికల బాల్‌బ్యాడ్మింటన్ రాష్ట్రస్థాయి టోర్నీలో జిల్లా బాలబాలికల జట్లు విజేతలుగా నిలిచి చాంపియన్‌ను కైవసం చేసుకున్నాయి. ఈనెల 10 నుంచి 12వ తేదీ వరకు న ల్గొండ జిల్లాలోని మిర్యాలగూడలో టో ర్నీ జరిగింది. ఇందులో బాలబాలికల జ ట్లు విజేతగా నిలిచాయి. బాలుర జట్టు లో ఉప్పల్‌వాయి గురుకుల విద్యార్థులు, బాలికల జట్టులో మొత్తం సుద్దపల్లి, కం జర విద్యార్థినులు ఉన్నారు.
ప్రత్యేకంగా అభినందించిన కలెక్టర్
రాష్ట్రస్థాయిలో జిల్లాను చాంపియన్‌గా నిలిపిన క్రీడాకారులను కలెక్టర్ డాక్టర్ యోగితారాణా గురువారం తన చాంబ ర్‌లో ప్రత్యేకంగా అభినందించారు. బా లబాలికల జట్ల కెప్టెన్‌లతో, పీడీ నాగేశ్వర్‌తో మాట్లాడారు. జిల్లాను రాష్ట్రస్థాయి లో ప్రథమస్థానంలో నిలిపినందుకు, ఇందుకు కృషిచేసిన ప్రిన్సిపాల్స్, కోచ్‌ల ను అభినందించారు. మరిన్ని విజయా లు సాధిస్తూ జిల్లాకు, రాష్ట్రానికి మంచి పేరుప్రఖ్యాతలు తీసుకురావాలన్నారు. కార్యక్రమంలో అండర్–19 ఎస్‌జీఎఫ్ కార్యదర్శి ఎండీ షకీల్, డీసీవో సాయినా థ్, సుద్దపల్లి, కంజర ప్రిన్సిపాల్స్ సరోజినాయుడు, సింధు, ఉప్పల్‌వాయి పీడీ నాగేశ్వర్‌రావు, నర్మద, దేవలక్ష్మి, నీరజ, జోత్య్స, ఎన్.కృష్ణ, క్రీడాకారులు పాల్గొన్నారు.
లంచ్ చేయించకుండా
జారుకున్న డీసీవో
క్రీడాకారులకు లంచ్ చేయించాలని గు రుకులాల జిల్లా కో–ఆర్డినేటర్ సాయినాథ్‌ను కలెక్టర్ ఆదేశించారు. కలెక్టర్ చాంబర్ నుంచి బయటకు వచ్చిన కోద్దిసేపటికి కో–ఆర్డినేటర్ ఎవరికీ చెప్పకుండా జారుకున్నాడు. దీంతో సుద్దపల్లి ప్రిన్సిపాల్, పీడీలు కో–ఆర్డినేటర్‌కు ఫోన్ చేయగా స్పందించలేదు. కలెక్టర్ సీసీ రామును కలిసి విషయం తెలిపారు. సీసీ కలెక్టర్ అనుమతితో మెస్‌లో అందరికీ లంచ్ చేయించారు.
జాతీయస్థాయికి ఎంపికైన క్రీడాకారులు
రాష్ట్రస్థాయిలో ప్రతిభ చూపి విజేతలుగా నిలిచిన జట్ల నుంచి జాతీయస్థాయికి పలువురు క్రీడాకారులు ఎంపియ్యారు. బాలుర జట్టులో ఆర్.అనిల్‌కుమార్, పి.సాయికుమార్, సీహెచ్.మహేశ్(ఉప్పల్‌వాయి)లు ఎంపిక కాగా, బాలికల జట్టులో లిఖిత, అలేఖ్య(సుద్దపల్లి), ప్రత్యూష(కంజర)లు ఎంపికయ్యారు.
Advertisement