
అక్రమాలకు ‘తూర్పు’ అడ్డా
► కలప అక్రమ రవాణా.. నకిలీ నోట్ల చలామణి ఇక్కడి నుంచే
► సరిహద్దులు దాటుతున్న గుడుంబా గుట్కాల స్మగ్లింగ్‌కు కేంద్రం
► కోట్లు సంపాదిస్తున్న స్మగ్లర్లు కొరవడిన నిఘా
ఒకప్పుడు నక్సలిజానికి.. తర్వాత మావోయిస్టులకు కంచుకోటగా ఉన్న జిల్లా తూర్పు పల్లెలు ఇప్పుడు అక్రమ దందాలకు అడ్డాగా మారుతున్నారుు. మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల సరిహద్దు గ్రామాలు అసాంఘిక కార్యకలాపాలకు కేంద్రాలవుతున్నారుు. టేకు కలప, గోదావరి ఇసుక అక్రమ రవాణా మొదలుకుని గంజాయి సాగు, గుట్కా అమ్మకాలు, దొంగ నోట్ల చలామణి, గుడుంబా తయారీ, పేకాట, కోడి పందేలకు స్థావరాలుగా మారారుు. పల్లెల్లో పాగావేసిన స్మగ్లర్లు కోట్లు సంపాదిస్తున్నారు. నియంత్రించాల్సిన అధికారులు నిద్రపోతున్నారు. - కాళేశ్వరం
ఆగని గంజాయి సాగు..?
మహదేవపూర్ మండలంలోని పలు గ్రామాల్లో గంజాయిని రైతులు యథేచ్ఛగా సాగుచేస్తున్నారు. రెండు నెలల క్రితం సూరారం గ్రామంలో కొంత మంది రైతులు పత్తి, మిర్చి పంటలో అంతర పంటగా గంజాయిని సాగు చేశారు. గుర్తించిన పోలీసులు రైతులను అరెస్ట్ చేశారు. అరుునా మండలంలోని చాలా గ్రామాల్లో రహస్యంగా గంజాయి సాగు చేస్తున్నారు. స్థానిక యువత కూడా క్రమంగా గంజాయికి బానిసవుతోంది.
జిల్లాలు దాటుతున్న టేకు కలప...!
మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లోని టేకు కలపను మహదేవపూర్ మండలంలోని లోతట్టు ప్రాంతాల్లో డంప్ చేసుకుని స్మగ్లర్లు జిల్లా సరిహద్దులు దాటిస్తున్నారు. వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, హైదరాబాద్ తదితర పట్టణాలకు కలప ఇక్కడినుంచే తరలిపోతోంది. మహదేవపూర్ ప్రాంతం ఒకప్పుడు దండకారణ్యం ఉండేది. ప్రస్తుతం ఇక్కడి అటవీప్రాంతంలో టేకు కలప దొరికే పరిస్థితి లేదు. దీంతో స్మగ్లర్లు మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల నుంచి భారీగా కలపను గోదావరి మీదుగా దిగుమతి చేస్తున్నారు. స్మగర్ల మాట వినని ఫారెస్టు అధికారులపై దాడులు కూడా జరుగుతున్నాయి. కొందరు అటవీశాఖ అధికారులు స్మగ్లర్లతో చేతులు కలిపి అక్రమ రవాణాకు సహకరిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
విచ్చలవిడిగా వన్యప్రాణి మాసం అమ్మకాలు..
మహదేవాపూర్ మండలంలో వన్యప్రాణుల మాంసం విక్రయూలు విచ్చలవిడిగా జరుగుతున్నారుు. అటవీ జంతువులను వేటగాళ్లు చంపి వాటి మాంసాన్ని జిల్లాలు దాటిస్తున్నారు. అటవీశాఖ అధికారులు అమాయకులపై దాడులు చేస్తున్నారు. వేటగాళ్ల జోలికి మాత్రం వెళ్లడంలేదు.
అందుబాటులో నిషేధిత గుట్కా
తూర్పున గుట్కా వ్యాపారం వర్ధిల్లుతోంది. ఆదిలాబాద్ జిల్లా చెన్నూర్ నుంచి కరీంనగర్ జిల్లా కాళేశ్వరం మీదుగా మహారాష్ట్ర గడ్చిరోలి మీదుగా నిషేదిత గుట్కా, తంబాకు వ్యాపారం జోరుగ సాగుతోంది. ఇక్కడి నుంచి కాటారం, మహదేవపూర్, మహాముత్తారం, మంథని గ్రామాలకు అక్రమ రవాణా చేస్తూ లక్షలు సంపాదిస్తున్నారు వ్యాపారులు.
యథేచ్ఛగా నకిలీ నోట్ల చలామణి
మహదేవపూర్,కాటారం తదితర ప్రాంతాల్లో నకిలీనోట్ల చలామణి యథేచ్ఛగా సాగుతోంది. బ్యాంకులు, కిరాణ దుకాణాలు, హోటళ్లు, మద్యం దుకాణాల్లో నకిలీ నోట్లు దర్శనమిస్తున్నారుు. కాళేశ్వరం బ్యాంకుకు ఓ ఖాతాదారుడు నకీలీ నోట్లు తీసుకురావడంతో బాంకు సిబ్బంది గుర్తించారు. మరో మారు కాళేశ్వరం దేవస్థానంలో భక్తుడి ద్వార పూజా టికెట్లకు రాగా, బ్యాంకులో ఫేక్ నోట్‌గా గుర్తించి చించేశారు. మహారాష్ట్ర,తెలంగాణ కేంద్రంగా నకిలీనోట్ల ముఠా వ్యాపారం సాగిస్తున్నట్లు సమాచారం. గతంలో మండలానికి చెందిన ఓ వ్యక్తి మంచిర్యాలలో నకిలీనోట్ల కేసులో పట్టుబడ్డాడు.
గుప్పుమంటున్న గుడుంబా
పచ్చని పల్లెల్లో గుడుంబా చిచ్చుతో సంసారాలు చీలిపోతున్నాయి. మండలంలోని పలుగ్రామాల్లో ఇతర జిల్లాల నుంచి పటిక,బెల్లం అక్రమంగా దిగుమతి చేసుకుని ఇక్కడ గుడుంబా తయారు చేస్తున్నారు. కొంతమంది సారా వ్యాపారులు పల్లెల్లో గుడుంబా తయారి కేంద్రాలు ఏర్పాటు చేసి మహారాష్ట్రకు తరలిస్తున్నారు. అధికారులకు నెలనెలా మామూళ్లు ముట్టజెబుతుండడంతో ఎక్సైజ్ పోలీసులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
గోదావరి ఇసుక అక్రమ రవాణా..
వాల్టా చట్టానికి తూట్లు పొడుస్తూ గోదావరి ఇసుకను స్మగ్లర్లు అక్రమంగా తరలించుకుపోతున్నారు. నిత్యం వందల ట్రాక్టర్ల ద్వార కాళేశ్వరం, పలుగుల, అన్నారం, కుదురుపల్లి, బీరసాగర్ నుంచి ఇసుక తరలిపోతోంది. వీరిపై స్థానిక రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకోకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
బాబోయ్...దొంగలు..!
మహదేవపూర్ మండలంలో దొంగలు వణుకు పుట్టిస్తున్నారు. ఏడాదిన్నరగా తాళం వేసిన ఇంటికి కన్నం వేసి దొరికింది దోచుకుపోతున్నారు. దొంగలను పట్టుకోవడంలో పోలీసులు విఫలమవుతున్నారు. మండలంలో సుమారుగా 15 దొంగతనాలు జరిగినా ఒక్క కేసును కూడా పోలీసులు ఛేదించలేదు. కనీసం కేసు కూడా నమోదు చేసుకోలేదని తెలిసింది.