
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో గుట్కా, పాన్ మసాలా అమ్మకంపై నిషేధాన్ని పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆహార భద్రత కమిషనర్ శాంతికుమారి ఈ మేరకు గెజిట్ నోటిఫికేషన్ జారీ చేశారు. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ డైరెక్టర్ శంకర్ ఈ ప్రకటన విడుదల చేశారు. నికొటిన్, పొగాకు ఆనవాళ్లు ఉండి, నోటి ద్వారా తీసుకునే అన్ని ఉత్పత్తులపైనా నిషేధం విధించినట్లు తెలిపారు. గుట్కా, పాన్‌మసాలా అమ్మకాలపై 2013 జనవరి 9 నుంచి రాష్ట్ర ప్రభుత్వం నిషేధం విధిస్తోంది.
ప్రతిఏటా కొత్తగా ఉత్తర్వులు జారీ చేస్తోంది. గత ఏడాది జారీచేసిన ఉత్తర్వు గడువు బుధవారంతో ముగిసింది. కాగా, నిషేధం కొనసాగింపుపై పునరాలోచించాలని హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ గత నెలలో ప్రభుత్వాన్ని కోరారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ నిర్ణయంపై ఆసక్తి నెలకొంది. గురువారం జారీచేసిన ఉత్తర్వులతో ఈ అస్పష్టతకు తెరపడింది.
Comments
Please login to add a commentAdd a comment