సాక్షి, చిత్తూరు : తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం సంపాదించాలని ఆశపడి అడ్డదారులు తొక్కిన ఓ వ్యక్తి కటకటాల పాలయ్యాడు. ఎస్పీ రాజశేఖబాబు తెలిపిన వివరాల ప్రకారం.. చిత్తూరులోని గాంధీ రోడ్డులో నివాసం ఉండే హరనాథ్ సిగరెట్ల వ్యాపారం చేస్తుండేవాడు. సిగరెట్లలో ఎక్కువ పెట్టుబడి అవసరం కావటంతో తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం తెచ్చిపెట్టే నిషేధిత గుట్కా వ్యాపారం మొదలుపెట్టాడు. దీనికోసం కోలార్, ములబగల్, పలమనేరు, చిత్తూరు కేంద్రాలుగా లావాదేవీలు సాగిస్తున్నాడు. దీనిపై నిఘా పెట్టిన పోలీసులు నెల క్రితం చిత్తూరు బైపాస్ రోడ్ లోని ఒక ఇంట్లో భారీగా ఉంచిన గుట్కా నిల్వలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
అదే విధంగా పలమనేరులోనూ తనిఖీలు చేపట్టిన పోలీసులు భారీ మొత్తాల్లో నిల్వ ఉంచిన గుట్కాను స్వాధీనం చేసుకున్నారు. ములబగల్, కోలార్ తో పాటు రాయవెల్లూర్‌లోనూ ఇతని గోదాముల్లోనూ గుట్కా నిల్వలున్నాయని పోలీసులు గుర్తించారు. దీంతో హరనాథ్‌పై పీడీ యాక్ట్ కింద కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతనికి సహకరించిన పోలీసులపై కూడా చర్యలుంటాయని ఎస్పీ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment