ప్రతీకాత్మక చిత్రం
నిజామాబాద్ అర్బన్: నగరంలోని సరస్వతినగర్‌లో సుమారు రూ.5లక్షలు విలువచేసే గుట్కా పోలీసులకు చిక్కినట్లే చిక్కి మాయమైంది. సుమారు రూ.5లక్షల విలువచేసే గుట్కాను ఓ మహిళ సరస్వతినగర్‌లో ఒక ఆస్పత్రి పక్కన రేకులషెడ్డులో దాచిపెట్టింది. కొన్ని నెలలుగా ఇక్కడి నుండి గుట్కాను ఇతర ప్రాంతాలకు తరలిస్తోంది. గుట్కా వ్యాపారం నిర్వహిస్తున్న మహిళ కోడలు తన అత్త గుట్కాను తరలిస్తుందని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు మంగళవారం గుట్కాను పట్టుకునేందుకు రాత్రి 9 గంటల సమయంలో వెళ్లారు. పోలీసులు వెళ్లేలోపలే అక్కడి నుండి గుట్కా మాయమైంది. పోలీ సులు వెళ్లాక అక్క గుట్కా లేకపోవడంతో అవాక్కయ్యారు. సంబంధిత శాఖ నుండే సమాచారం లీక్ అయి నట్లు తెలిసింది. గుట్కా నిర్వహిస్తున్న మహిళ కోడలు పక్కా సమాచారం ఆధారాలతో పోలీసులకు సమర్పించగా పోలీసులు దానిని పట్టుకోలేకపోయారు. పోలీసులు దాడిచేస్తున్న సమాచారం తెలియడం సదరు మహిళ గుట్కాను మాయంచేసింది. ప్రస్తుతం గుట్కా మాయం కావడంపై రహస్యం గా విచారణ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment