పోలీస్‌స్టేషన్‌లో ఉన్న గుట్కా, ఖైనీ బస్తాలతో ఎస్‌ఐ నరసింహామూర్తి
తిలారు జంక్షన్ (జలుమూరు) : తిలారు రైల్వేస్టేషన్ నుంచి అక్రమంగా తరలిస్తున్న గుట్కా, ఖైనీలు పట్టుకొని సారవకోట మండలం జమ్మచక్రం గ్రామానికి చెందిన బోయిన శ్రీనివాసరావుపై బుధవారం కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ పి.నరసింహామూర్తి తెలిపారు. తిలారు రైల్వేస్టేషన్ నుంచి ఖైనీలు, గుట్కాలు మూటలు దిగి అక్రమంగా రవాణా జరుగుతున్నాయన్న సమాచారంపై సిబ్బందితో తిలారు జంక్షన్‌లో దాడి చేసి పట్టుకొన్నామని ఎస్‌ఐ తెలిపారు. వీటి విలువ రూ 25,985 ఉంటుందన్నారు. ఇందులో ఖైనీలు, గుట్కాలు ఉన్నాయన్నారు. అరెస్ట్ చేసి సొంత పూచికత్తులపై విడిచిపెట్టామన్నారు. ఈయనతో పాటు ఏఎస్‌ఐ తులసీరావు, హెచ్‌సీ గణపతి సిబ్బంది ఉన్నారు. తిలారు స్టేషన్ అడ్డాగా అక్రమ రవాణ జరుగుతోందన్నడానికి రెండు రోజులుగా పట్టుబడుతున్న అక్రమ రవాణ గుట్కాలు, ఖైనీలు మూటలే నిదర్శనం.