tilaru railway station
-
దిఘా ఎక్స్ప్రెస్కు తప్పిన పెనుప్రమాదం
సాక్షి, విశాఖపట్నం : దిఘా నుంచి విశాఖపట్టణం వెళుతున్న దిఘా ఎక్స్ప్రెస్కు శనివారం తృటిలో ప్రమాదం తప్పింది. శ్రీకాకుళం జిల్లా జలుమూరు మండలం తిలారు రైల్వేస్టేషన్ సమీపంలో రైలు పట్టాలు విరిగిపోయాయి. అయితే ఈ విషయాన్ని గమనించిన డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించి రైలును ఆపివేశాడు. అయితే అప్పటికే ఇంజిన్ సహా మూడు బోగీలు విరిగిన పట్టాల పైనుంచి వెళ్లాయి. ఎట్టకేలకు రైలు ఆగటంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. దీంతో గంటపాటు రైలు నిలిచిపోయింది. సమాచారం అందుకున్న రైల్వే సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మరమ్మతులు చేశారు. అనంతరం రైలు కదిలింది. -
తిలారులో నిలిచిన ధురంతో ఎక్స్ప్రెస్
ఐదున్నర గంటల పాటు నిలిపివేత ప్రయాణికులకు తప్పని అవస్థలు తిలారు ఆర్ఎస్(జలుమూరు): యశ్వంత్పూర్ నుంచి ఔరా వెళ్లాల్సిన ధురంతో ఎక్స్ప్రెస్లో శుక్రవారం సాంకేతిక లోపం తలెత్తింది. సుమారు ఐదున్నర గంటల పాటు తిలారు రైల్వేస్టేషన్లో నిలిచిపోయింది. తిలారు స్టేషన్ మాస్టర్ పాడి తెలిపిన సమాచారం మేరకు... ఉదయం ఆరు గంటల సమయంలో టెక్కలిపాడు–బసివాడ రైల్వేక్రాసింగ్ గేటు వద్ద గేదె అడ్డంగా రావడంతో రైలుకు ఎయిర్ లాక్ అయ్యింది. బండి ముందుకు కదలలేదు. ఉదయం 7.30 గంటల వరకు అక్కడే నిలిపివేశారు. డ్రైవర్ తాత్కాలికంగా బాగుచేసి మెల్లగా తిలారు స్టేషన్కు తీసుకొచ్చారు. 10.30 గంటల వరకూ స్టేషన్లోనే ఉండిపోయింది. చివరకు రైల్వే మెకానిక్లు వచ్చి బాగుచేయడంతో రైలు ముందుకు కదిలింది. సాంకేతిక అంతరాయంతో ప్రయాణికులు అవస్థలు పడ్డారు. మాస్టర్ పాడి తెలిపారు. -
రూ.26 వేల గుట్కా, ఖైనీ పట్టివేత
తిలారు జంక్షన్ (జలుమూరు) : తిలారు రైల్వేస్టేషన్ నుంచి అక్రమంగా తరలిస్తున్న గుట్కా, ఖైనీలు పట్టుకొని సారవకోట మండలం జమ్మచక్రం గ్రామానికి చెందిన బోయిన శ్రీనివాసరావుపై బుధవారం కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ పి.నరసింహామూర్తి తెలిపారు. తిలారు రైల్వేస్టేషన్ నుంచి ఖైనీలు, గుట్కాలు మూటలు దిగి అక్రమంగా రవాణా జరుగుతున్నాయన్న సమాచారంపై సిబ్బందితో తిలారు జంక్షన్లో దాడి చేసి పట్టుకొన్నామని ఎస్ఐ తెలిపారు. వీటి విలువ రూ 25,985 ఉంటుందన్నారు. ఇందులో ఖైనీలు, గుట్కాలు ఉన్నాయన్నారు. అరెస్ట్ చేసి సొంత పూచికత్తులపై విడిచిపెట్టామన్నారు. ఈయనతో పాటు ఏఎస్ఐ తులసీరావు, హెచ్సీ గణపతి సిబ్బంది ఉన్నారు. తిలారు స్టేషన్ అడ్డాగా అక్రమ రవాణ జరుగుతోందన్నడానికి రెండు రోజులుగా పట్టుబడుతున్న అక్రమ రవాణ గుట్కాలు, ఖైనీలు మూటలే నిదర్శనం.