తిలారు రైల్వేస్టేషన్‌లో ఆగిఉన్న ధురంతో ఎక్స్‌ప్రెస్
తిలారులో నిలిచిన ధురంతో ఎక్స్‌ప్రెస్
Published Fri, Sep 30 2016 11:23 PM | Last Updated on Mon, Sep 4 2017 3:39 PM
ఐదున్నర గంటల పాటు నిలిపివేత
ప్రయాణికులకు తప్పని అవస్థలు
తిలారు ఆర్‌ఎస్(జలుమూరు): యశ్వంత్‌పూర్ నుంచి ఔరా వెళ్లాల్సిన ధురంతో ఎక్స్‌ప్రెస్‌లో శుక్రవారం సాంకేతిక లోపం తలెత్తింది. సుమారు ఐదున్నర గంటల పాటు తిలారు రైల్వేస్టేషన్‌లో నిలిచిపోయింది. తిలారు స్టేషన్ మాస్టర్ పాడి తెలిపిన సమాచారం మేరకు... ఉదయం ఆరు గంటల సమయంలో టెక్కలిపాడు–బసివాడ రైల్వేక్రాసింగ్ గేటు వద్ద గేదె అడ్డంగా రావడంతో రైలుకు ఎయిర్ లాక్ అయ్యింది. బండి ముందుకు కదలలేదు. ఉదయం 7.30 గంటల వరకు అక్కడే నిలిపివేశారు.
డ్రైవర్ తాత్కాలికంగా బాగుచేసి మెల్లగా తిలారు స్టేషన్‌కు తీసుకొచ్చారు. 10.30 గంటల వరకూ స్టేషన్‌లోనే ఉండిపోయింది. చివరకు రైల్వే మెకానిక్‌లు వచ్చి బాగుచేయడంతో రైలు ముందుకు కదిలింది. సాంకేతిక అంతరాయంతో ప్రయాణికులు అవస్థలు పడ్డారు. మాస్టర్ పాడి తెలిపారు.
Advertisement