న్యూఢిల్లీ: గుట్కా, పాన్ మసాలా వంటి నమిలే పొగాకు ఉత్పత్తులను నిషేధించేందుకు చర్యలెందుకు తీసుకోరని ఆహార భద్రత ప్రమాణాల శాఖను ఢిల్లీ హైకోర్టు ప్రశ్నించింది. కేంద్రంగానీ లేదా ఏదేని రాష్ట్రాలు గానీ నమిలే పొగాకు ఉత్పత్తులపై నిషేధం విధించాయా అని కోర్టు ప్రశ్నించింది. గుట్కాపై నిషేధం విధించాలని ఢిల్లీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ ఓ పొగాకు ఉత్పత్తి సంస్థ వేసిన వ్యాజ్యాన్ని కోర్టు విచారించింది.
ఈ సందర్భంగా పోక చెక్క, పొగాకు, మరికొన్ని విషపదార్థాలను తమలపాకులో చుట్టి పాన్ మసాలా తయారు చేస్తున్నారని.. ఇది ఆరోగ్యానికి హానికరమైనదని తెలిసి కూడా సంబంధిత అధికారులు నిషేధం ఎందుకు విధించడంలేదని న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ సచ్‌దేవ వ్యాఖ్యానించారు.
ఇంకా ఆయన మాట్లాడుతూ.. నమిలే పొగాకు ఉత్పత్తులమీద నిషేధం విధిస్తే అసలు సమస్యే లేకుండా పోతుంది కదా అని న్యాయమూర్తి అడిగిన ప్రశ్నకు ఆహార భద్రత ప్రమాణాల శాఖ తరఫున న్యాయవాది ఎం. ప్రచా సమాధానమిస్తూ.. నమిలే పొగాకు ఉత్పత్తుల నిషేధానికి ప్రత్యేక నోటిఫికేషన్ అవసరం లేదని.. గుట్కాపై విధించిన నిషేధం వీటికి వర్తిస్తుందన్నారు. అయితే, గుట్కాపై విధించిన నిషేధం చట్టాలు బలంగా అమలు కావడంలేదని ఆయన కోర్టుకు తెలిపారు. వాదనల అనంతరం విచారణను ఈ నెల 11కు వాయిదా వేసింది.
నమిలే పొగాకు ఉత్పత్తుల్ని నిషేధించరేం?
Published Thu, May 4 2017 5:21 PM | Last Updated on Wed, Sep 26 2018 6:49 PM
Advertisement