పాన్ కోకాలపై పోలీసుల దాడులు | The police raids on pan coca | Sakshi
Sakshi News home page

పాన్ కోకాలపై పోలీసుల దాడులు

Published Tue, Feb 24 2015 5:27 AM | Last Updated on Wed, Sep 26 2018 6:49 PM

పాన్ కోకాలపై పోలీసుల దాడులు - Sakshi

పాన్ కోకాలపై పోలీసుల దాడులు

రూ. 50 వేల విలువ చేసే పొగాలు ఉత్పత్తుల కాల్చివేత
నిజామాబాద్ క్రైం : జిల్లా కేంద్రంలో పొగాకు ఉత్పత్తులు, గుట్కాలు విక్రయించే కోకాలపై పోలీసులు దాడులు ముమ్మరం చేశారు. సోమవారం జిల్లా కేంద్రంలోని రైల్వేస్టేషన్, తదితర ప్రాంతాల్లో పాన్ కోకాలపై ఎస్‌హెచ్‌ఓ శ్రీనివాసులు దాడులు జరిపారు. జనసమ్మర్థమైన ప్రాంతమైనందున ఇక్కడ పాన్ కోకాలు ఎక్కువగా ఉన్నాయి.గుట్కా పాకెట్ట విక్రయాలూ ఎక్కువగానే ఉంటాయి.

రైల్వేస్టేషన్, బస్టాండ్ రోడ్డు, గంజ్, బోధన్ రోడ్డు, అర్సపల్లి, మాలపల్లి ప్రాంతాలలో పాన్ కోకలపై దాడులు చేసి రూ. 50 వేల విలువ గల పొగాకు ఉత్పత్తులను పట్టుకున్నారు. పట్టుకున్న ప్యాకెట్లు దహనం చేశారు. నగరంలోని అయిదవ టౌన్ పోలీస్‌స్టేషన్ పరిధి వర్నిరోడ్డులోనూ పోలీసులు దాడులు చేశారు. టౌన్ రెండవ ఎస్సై నాగారాజు ఆధ్వర్యంలో వర్ని చౌరస్తా, నాగారం రోడ్డు, న్యాల్‌కల్ రోడ్డులో దాడులు చేశారు. పొగాకు, గుట్కా ప్యాకెట్లను పట్టుకున్నారు.
 
 గుట్కాపై పంజా
 
- చిరు వ్యాపారులపైనే దాడులు
- అసలు సూత్రధారులపై చర్యలు లేవు
- రోజుకు కోట్ల రూపాయల వ్యాపారం
- గతంలోనూ పట్టుకుని వదిలేశారు

నిజామాబాద్ అర్బన్: జిల్లావ్యాప్తంగా రెండు మూడు రోజులుగా పోలీసులు కొనసాగిస్తున్న దాడులు గుట్కా వ్యాపారులను కలవరపెడుతున్నారుు. పాన్‌షాపులు, కిరా  ణా దుకాణాలను విస్తృతంగా తనిఖీ చే స్తున్నారు. ఇప్పటికే లక్షల రూపాయల విలువ చేసే గుట్కా ప్యాకెట్లను పట్టుకొని దహనం చేశారు. నగరంతోపాటు ఆర్మూర్, మోర్తాడ్, భీంగల్, మద్నూ ర్, జుక్కల్, కామారెడ్డిప్రాంతాలలో ఈ దాడులు జరిగారుు. సోమవారం దా దాపు అన్ని ఠాణాల పరిధిలో సోదాలు నిర్వహించారు. గుట్కాల అమ్మకాలను నిరోధించేందుకు ఎస్‌పీ చంద్రశేఖర్‌రెడ్డి ప్రత్యేక టాస్క్‌ఫోర్సును ఏర్పాటు చేయడంతో అధికారులు కదిలారు.
 
చిరువ్యాపారులేసరే.. అసలు సూత్రదారులపై చర్యలేవి?

అయితే, పాన్‌కోకాలు, కిరాణాలపై దా డులు కొనసాగిస్తున్న పోలీసులు అస లు గుట్కా విక్రయదారులను ఎందుకు ఉపేక్షిస్తున్నారని పలువురు ప్రశ్నిస్తున్నా రు. జిల్లా కేంద్రంగా గుట్కా వ్యాపారం నిత్యం రూ. కోట్లలో జరుగుతుంది. ఓ పార్టీకి చెందిన మైనార్టీ నేత వ్యాపారం కొనసాగిస్తున్నారు. సారంగాపూర్ ప్రాంతంలోని ఓ గోదాంలో గుట్కాల సరఫరా కేంద్రం ఉంది. మండలాలకు ఇక్కడినుండే సరఫరా చేస్తున్నారు. గ తంలో  నిజామాబాద్ రూరల్ పోలీసు లు ఈ నేతకు చెందిన గుట్కా ఫ్యాకెట్ల కంటె రుునర్‌ను పట్టుకున్నారు.
 
దీంతో హడలెత్తిపోయిన ఈ వ్యాపారి ఓ మ హిళానేత సాయంతో విడిపించుకున్నా రు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఇతర ప్రాంతాలకు కూడా ఇక్కడి నుండే సరఫరా చేస్తున్నారు. గాంధీచౌక్‌లోని ప్ర ధాన కేంద్రంగా వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. గతంలో నగరంలోని పం డ్ల మార్కెట్ సమీపంలో మున్సిపల్ వై ద్యాధికారి సిరాజొద్దీన్ అక్రమంగా కొ  నసాగుతున్న జర్దా, గుట్కా కేంద్రాలపై దాడులు చేశారు. సుమారు ఆరు లక్షల విలువ చేసే గుట్కా ప్యాకెట్లను స్వాధీ   నం చేసుకున్నారు. మున్సిపల్‌కు చెంది న ఓ అధికారి మామూలు తీసుకొని అ    క్రమ వ్యాపారస్తులను వదిలివేసినట్లు సమాచారం. కేసు కూడా నమోదు చే యకపోవడం గమనార్హం.
 
మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాలైన బోధన్, జుక్క  ల్, మద్నూరు, బిచ్కుంద ప్రాంతాల లో ఈ వ్యాపారం కొనసాగుతుంది. ఈ ప్రాంతంలో పెద్ద మొత్తంలో నిల్వ కేం ద్రాలు ఉంటాయి. జిల్లా కేంద్రంలో కూడా ఈ విక్రయాలు ఎక్కువగా ఉండడంతో, రోజుకు లక్షలాది రూపాయల  విక్రయాలు జరుగుతుంటాయి. పోలీ  సులు అసలు సరఫరా చేసే గోదాములపై దాడులు చేస్తే ఇతర ప్రాంతాలకు గుట్కా,జర్దా చేరకుండా ఉంటుంది. వీ టిపై ఆరా తీసిన పోలీసులు  దాడులు మాత్రం చేయడం లేదు. జిల్లా కేంద్ర ం లో సోమవారం బస్టాండ్, రైల్వేస్టేషన్, మాలపల్లి, వినాయక్‌నగర్ ప్రాంతాల లో దాడులు కొనసాగాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement