గుట్కా విక్రయాలపై దాడులు
నెల్లూరు(క్రైమ్): నగరంలో నిషేధిత ఖైనీ, గుట్కాలను విక్రయిస్తున్న దుకాణాలు, నిల్వ కేంద్రాలపై నగర పోలీసులు గురువారం విస్తృత దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో సుమారు రూ.5లక్షలు విలువచేసే గుట్కాలు, ఖైనీలను స్వాధీనం చేసుకున్నారు.
-
రూ.5 లక్షల నిషేధిత గుట్కాలు, ఖైనీలు స్వాధీనం
నెల్లూరు(క్రైమ్): నగరంలో నిషేధిత ఖైనీ, గుట్కాలను విక్రయిస్తున్న దుకాణాలు, నిల్వ కేంద్రాలపై నగర పోలీసులు గురువారం విస్తృత దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో సుమారు రూ.5లక్షలు విలువచేసే గుట్కాలు, ఖైనీలను స్వాధీనం చేసుకున్నారు. జిల్లాలో ఇటీవల కాలంలో నిషేధిత ఖైనీలు, గుట్కా విక్రయాలు జోరుగా సాగుతున్నా సంబంధిత అధికారులు అటువైపుగా దృష్టిసారించ లేదు. దీనిపై సమాచారం అందుకున్న ఎస్పీ విశాల్‌గున్నీ నగరంలో గుట్కా విక్రయాలపై దాడులు చేసి విక్రయదారులు, సూత్రదారులపై చర్యలు తీసుకోవాలని నగర డీఎస్పీ వెంకటరాముడును ఆదేశించారు. దీంతో నగర డీఎస్పీ నేతృత్వంలో ఒకటి, రెండు, మూడు, నాలుగు, ఐదు, ఆరో నగర పోలీసులు ఆయా స్టేషన్ల పరిధిలో గుట్కాలు విక్రయిస్తోన్న దుకాణాలు, నిల్వ కేంద్రాలపై దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో సుమారు రూ.5లక్షల విలువ చేసే నిషేధిత ఖైనీలు, గుట్కాలను స్వాధీనం చేసుకున్నారు. 35 మంది విక్రయదారులను అదుపులోకి తీసుకుని పోలీసు స్టేషన్‌కు తరలించారు. పోలీసుల దాడుల విషయం తెలుసుకున్న పలువురు వ్యాపారులు దుకాణాలకు తాళంవేసి పరుగులు తీశారు. మరికొందరు దుకాణాల్లో ఉంచిన గుట్కా, ఖైనీలను హుటాహుటిన రహస్య ప్రాంతాలకు తరలించారు. కాగా పోలీసుల దాడుల ముందస్తు సమాచారం అందుకున్న గుట్కా విక్రయ డాన్‌లు అప్రమత్తమయ్యారు. దీంతో చిన్నచిన్న వ్యాపారులు మాత్రమే పోలీసులకు చిక్కారు. పోలీసుల అదుపులో ఉన్న చిన్నవ్యాపారులు అసలు వ్యక్తులను వదిలివేసి తమను అరెస్ట్‌చేయడం ఎంతవరకు సబబని వాపోతున్నారు. ఈ దాడుల్లో నాల్గో, ఐదో నగర ఇన్‌స్పెక్టర్లు సీహెచ్ సీతారామయ్య, జీ మంగారావు, ఎస్సైలు గిరిబాబు, వీ శ్రీహరి, రామకృష్ణ, సుధాకర్‌రావు, తదితరులు పాల్గొన్నారు.