
గుట్కా ప్యాకెట్లు తరలిస్తున్న వాహనాన్ని పరిశీలిస్తున్న ఎస్‌ఐ అశోక్‌కుమార్, సిబ్బంది
కొల్లూరు : గుట్టుచప్పుడు కాకుండా గుట్కా అక్రమ తరలింపు వ్యవహారం బట్టబయలైంది. గుంటూరు టాస్క్‌ఫోర్స్ పోలీసులు అందించిన పక్కా సమాచారంతో కొల్లూరు ఎస్‌ఐ బి. అశోక్‌కుమార్ కొల్లూరు మీదుగా వెళుతున్న కారును పోలీసు స్టేషన్ వద్ద ఆపి తనిఖీ చేశారు. కృష్ణాజిల్లా గుడివాడ ప్రాంతం నుంచి గుంటూరు వెళుతున్న వాహనంలో అక్రమంగా తరలిస్తున్న 23 బస్తాల గుట్కా, ఖైనీ ప్యాకెట్లను గుర్తించారు. వాటిని తరలిస్తున్న రేపల్లెకు చెందిన తుమ్మలపెంట ప్రదీప్, కొలుసు గోపీకృష్ణను అదుపులోకి తీసుకొని, వాహనాన్ని సీజ్ చేశారు. గుట్కా ప్యాకెట్ల విలువ రూ. 4 లక్షలు ఉంటుందని పోలీసులు అంచనా వేశారు. తెనాలి డీఎస్సీ స్నేహిత హుటాహుటిన కొల్లూరు స్టేషన్‌కు చేరుకుని గుట్కా ప్యాకెట్లను పరిశీలించారు. నిందితుల నుంచి సమాచారం సేకరించే పనిలో నిమగ్నమయ్యారు.
ఒరిస్సా నుంచి వచ్చినట్లు అనుమానాలు
గుట్కా ప్యాకెట్లు ఒరిస్సా నుంచి వచ్చినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అక్కడ నుంచి గుంటూరుకు రొయ్యలు సరఫరా చేసే కంటైనర్‌లో రవాణా అయినట్లు భావిస్తున్నారు. నిందితులు పొంతన లేని సమాధానాలు చెబుతున్నారు. పెద్ద తలకాయల పేర్లు బయట పడకుండా తప్పుదారి పట్టించే విధంగా వ్యవహరిస్తున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. ఫోన్ల ద్వారా గుట్టుచప్పుడు కాకుండా నడుస్తున్న అక్రమ వ్యాపారాన్ని ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఛేదించాలనే పట్టుదలతో ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment