అక్రమంగా అమ్మడానికి సిద్ధంగా ఉంచిన మూడు బస్తాల గుట్కా ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఇల్లందుకుంట: అక్రమంగా అమ్మడానికి సిద్ధంగా ఉంచిన మూడు బస్తాల గుట్కా ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా ఇల్లందుకుంట మండల కేంద్రంలో శనివారం జరిగింది. స్థానికంగా కిరాణ వ్యాపారం నిర్వహిస్తున్న అశోక్ అనే వ్యక్తి ఇంట్లో గుట్కా ప్యాకెట్లు ఉన్నాయనే సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు మూడు బస్తాల గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ రూ. 20 వేల వరకు ఉంటుందని పోలీసులు తెలిపారు.