rs. 20 thounds
-
రూ. 20వేల విలువైన గుట్కా పట్టివేత
ఇల్లందుకుంట: అక్రమంగా అమ్మడానికి సిద్ధంగా ఉంచిన మూడు బస్తాల గుట్కా ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా ఇల్లందుకుంట మండల కేంద్రంలో శనివారం జరిగింది. స్థానికంగా కిరాణ వ్యాపారం నిర్వహిస్తున్న అశోక్ అనే వ్యక్తి ఇంట్లో గుట్కా ప్యాకెట్లు ఉన్నాయనే సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు మూడు బస్తాల గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ రూ. 20 వేల వరకు ఉంటుందని పోలీసులు తెలిపారు. -
నిజామాబాద్లో దొంగల హల్చల్
నిజామాబాద్: నిజామాబాద్ జిల్లాలోని వర్ని మండలంలో దొంగలు విరుచుకుపడ్డారు. మండలంలోని చందూరు గ్రామంలో సోమవారం రాత్రి బీభత్సం సృష్టించారు. ఓ ఇంట్లోకి చొరబడి నిద్రిస్తున్న దంపతులను కత్తులతో బెదిరించి వారిపై దాడిచేసి 3 తులాల బంగారం, రూ. 20 వేల నగదు అపహరించుకుపోయారు. బాధితుల ఫిర్యాదుతో విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. ఇదిలా ఉండగా.. మండల కేంద్రంలో తాళం వేసిఉన్న మరో ఇంట్లో చోరీకి పాల్పడిన దొంగలు విలువైన వస్తువులు ఎత్తుకెళ్లారు. ఇంటి యజమాని అందుబాటులో లేకపోవడంతో ఎంత నష్టం వాటిల్లిందనే విషయం తెలియరాలేదు. పోలీసులు ఈ రెండు ఘటనలకు పాల్పడింది ఒకే ముఠానా అనే కోణంలో విచారణ చేపడుతున్నారు. -
మంచిర్యాలలో వరుస చోరీలు
ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల పట్టణంలో శుక్రవారం రాత్రి మరో చోరీ జరిగింది. బెల్లంపల్లి చౌరస్తాలోని ఓ దుకాణంలో శుక్రవారం రాత్రి దొంగలు పడ్డారు. దుకాణం వెనుక వైపు కిటికీ నుంచి లోపలికి ప్రవేశించిన దుండగులు రూ.20వేల నగదు ఎత్తుకుపోయారు. దుకాణం యజమాని రాజేందర్ శనివారం ఉదయం గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా, పట్టణంలో గురువారం రాత్రి రెండు చోట్ల దొంగతనాలు జరిగాయి. (మంచిర్యాల)