కరీంనగర్ : కరీంనగర్ జిల్లా మహదేవ్పూర్ మండలం కాళేశ్వరంలో ముగ్గురు వ్యక్తులను పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి భారీగా గుట్కా ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్కి తరలించారు. పోలీసులు వారిపై కేసు నమోదు చేశారు. పట్టుబడిన గుట్కా ప్యాకెట్ల విలువ రూ. 60 వేలు ఉంటుందని పోలీసులు చెప్పారు.