టీడీపీ డీలర్ కాకపోతే జైలుకే.. | If the TDP to the dealerin the jail | Sakshi
Sakshi News home page

టీడీపీ డీలర్ కాకపోతే జైలుకే..

Published Sat, May 21 2016 5:35 AM | Last Updated on Wed, Sep 5 2018 1:38 PM

టీడీపీ డీలర్ కాకపోతే జైలుకే.. - Sakshi

టీడీపీ డీలర్ కాకపోతే జైలుకే..

 టీడీపీ జిల్లా పరిశీలకుడు గోవర్ధన్‌రెడ్డి

నందికొట్కూరు/పగిడ్యాల: డీలర్లుగా పనిచేసే వారు టీడీపీ కార్యకర్తలు కాకపోతే వారిపై విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌కు ఫిర్యాదు చేసి జైలుకు పంపించాలని తెలుగుదేశం పార్టీ జిల్లా పరీశీలకులు గోవర్ధన్‌రెడ్డి..పార్టీ నాయకులకు సూచించారు. శుక్రవారం అల్లూరు గ్రామంలో టీడీపీ మినీమహానాడు నిర్వహించారు. పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ మాండ్ర శివానందరెడ్డి అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆయన మాట్లాడారు. ఈ సందర్భంలో కొందరు కార్యకర్తలు తమ సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు.

పార్టీ పుట్టక నుంచి పనిచేసిన కార్యకర్తకు కనీసం డీలర్ పోస్టును కూడా ఇప్పించుకోలేని దుస్థితిలో ఉన్నామని మిడుతూరుకు చెందిన నాయకులు చెప్పడంతో ఆయన పై విధంగా స్పందించారు. టీడీపీ డీలర్ కాకపోతే జైలుకు పంపి ఆ స్థానంలో పార్టీకి చెందిన వారిని నియమించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా ప్రచార కార్యనిర్వాహక కార్యదర్శి వై. రామయ్య, జిల్లా కార్యదర్శి గిరీశ్వరరెడ్డి, మున్సిపల్ చైర్మన్ సుబ్బమ్మ, జెడ్పీటీసీ సభ్యులు లక్ష్మిదేవి, దుష్యంత్‌రెడ్డి, రంగారెడ్డి, పురుషోత్తంరెడ్డి, ఎంపీపీలు ప్రసాదరెడ్డి, సీతమ్మ, మంజుల పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement