- ∙ఒకరిద్దరి సస్పెండ్‌తో సరిపోదు
- ∙అక్రమ సొమ్మును రికవరీ చేయాలి
- ∙బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎడ్ల అశోక్‌రెడ్డి
‘మిషన్’ పనులపై విజిలెన్స్ విచారణ జరిపించాలి
Published Fri, Sep 2 2016 11:31 PM | Last Updated on Mon, Sep 4 2017 12:01 PM
హన్మకొండ : మిషన్ కాకతీయ పనులపై పూర్తి స్థాయి అక్రమాలు బయటకు తీయడానికి విజిలెన్స్‌చే విచారణ జరిపించాలని బీజే పీ జిల్లా అధ్యక్షుడు ఎడ్ల అశోక్‌రెడ్డి డిమాండ్ చేశా రు. శుక్రవారం హన్మకొండ ఎన్జీవోస్ కాల నీలోని పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మా ట్లాడుతూ ఒకరిద్దరు అధికారులను సస్పెండ్ చేస్తే సరిపోదన్నారు. మిషన్ పనుల్లో అక్రమాలు జరుగుతున్నాయని తాము ఆధారాలతో సహా ఫిర్యాదు చేసినా ప్రభుత్వం పట్టిం చుకోలేదన్నారు. జిల్లా లో పునర్విభజన ప్రజాభీష్టం మేరకు జరగాలని, వరంగల్, హన్మకొండ నగరాన్ని విడదీసే ఆలోచనను విరమించుకోవాలన్నారు. హన్మకొండ జిల్లా చేయొద్దని వరంగల్‌లోనే కొనసాగించాలని, జనగామను జిల్లా చేయాలని డిమాండ్ చేశా రు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు డాక్టర్ పెసరు విజయ్‌చందర్‌రెడ్డి మాట్లాడుతూ బం గారు తెలంగాణ సాధనలో మిషన్ కాకతీయ ద్వారా ప్రభుత్వ పెద్దలు బంగారం సంపాదించుకుంటున్నారని ఆరోపించారు. సెప్టెం బర్ 17న తెలంగాణ విమోచన దినాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి తాళ్ళపల్లి కుమారస్వామి, నాయకులు కొత్త దశరథం, పెదగాని సోమయ్య, మల్లాడి తిరుపతిరెడ్డి, చందుపట్ల కీర్తి, రాజి రెడ్డి, వీసం రమణారెడ్డి పాల్గొన్నారు.
Advertisement