గరిమెనపెంట భూములపై విజిలెన్స్‌ విచారణ | Vigilance inquiry on lands | Sakshi
Sakshi News home page

గరిమెనపెంట భూములపై విజిలెన్స్‌ విచారణ

Published Thu, Nov 24 2016 1:36 AM | Last Updated on Mon, Sep 4 2017 8:55 PM

గరిమెనపెంట భూములపై విజిలెన్స్‌ విచారణ

గరిమెనపెంట భూములపై విజిలెన్స్‌ విచారణ

రాపూరు: మండలంలోని గరిమెనపెంటలో గల సర్వే నంబర్‌ 75 – 2ఏలోని 556 ఎకరాల భూములపై జిల్లా విజిలెన్స్‌ అధికారులు బుధవారం విచారణ చేపట్టారు. తహసీల్దార్‌ కార్యాలయంలో గరిమెనపెంటకు సంబంధించిన రెవెన్యూ రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా తహసీల్దార్‌ కార్యాలయంలో జిల్లా విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఏఓ ధనుంజయరెడ్డి మాట్లాడారు. గరిమెనపెంటలో సర్వే నంబర్‌ 75 – 2ఏలో 556 ఎకరాల భూములు ఉన్నాయని, ఈ భూముల్లో కొంత అటవీ భూములుగా రెవెన్యూ రికార్డుల్లో ఉన్నాయని, అయితే కొందరు ఈ భూములను కొనుగోలు చేసినట్లు, పాస్‌పుస్తకాల 1బీ అడంగళ్‌లో పేర్లు నమోదు చేసి ఉన్నారని వివరించారు. అసలు ఈ భూములు ఎవరివి, పేర్లు మార్చి విక్రయించింది ఎవరు, వీరికి సహకరించిన అధికారులెవరు అని ఫిర్యాదులు రావడంతో విజిలెన్స్‌ ఎస్పీ రమేషయ్య ఆదేశాల మేరకు విచారణ చేపట్టామని తెలిపారు. విచారణ చేసి ఉన్నతాధికారులకు నివేదిక అందిస్తామని తెలిపారు. అనంతరం తహసీల్దార్‌ నిర్మలానందబాబా మాట్లాడారు. ఈ భూములపై సర్వే నిర్వహించామని, నివేదికను అధికారులకు అందించామని తెలిపారు. రేంజర్‌ ఉమామహేశ్వరరెడ్డి పాల్గొన్నారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement