inquiry on lands
-
అయోధ్య కేసులో మిగిలింది ప్రధాన కక్షిదారులే
న్యూఢిల్లీ: వివాదాస్పద అయోధ్య భూ కేటాయింపు కేసు విచారణలో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ సున్నిత కేసులో కక్షిదారులుగా చేరడానికి సామాజిక కార్యకర్తలు తీస్తా సెతల్వాడ్, శ్యామ్ బెనగల్‌కు సుప్రీంకోర్టు నిరాకరించింది. దీంతో ప్రధాన కక్షిదారులే ఇకపై విచారణలో పాల్గొంటారు. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని బెంచ్ బుధవారం ఆదేశాలు జారీచేసింది. భూ వివాదానికి సంబంధించిన పిటిషన్లను ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ చేయాలా? లేదా? అన్న అంశంపై తొలుత నిర్ణయం తీసుకుంటామని ధర్మాసనం తెలిపింది. ‘మధ్యంతర జోక్యంపై కక్షిదారుల లాయర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. అలాంటి పిటిషన్లతో ఎలాంటి ప్రయోజనం లేదని భావిస్తూ వాటిని తిరస్కరిస్తున్నాం’ అని బెంచ్ పేర్కొంది. ఇకపై కూడా అలాంటి పిటిషన్లను స్వీకరించొద్దని కోర్టు రిజిస్ట్రీని ఆదేశించింది. హిందూ, ముస్లిం సంస్థలు, వ్యక్తులే కక్షిదారులుగా కొనసాగుతారని స్పష్టం చేసింది. -
గరిమెనపెంట భూములపై విజిలెన్స్ విచారణ
రాపూరు: మండలంలోని గరిమెనపెంటలో గల సర్వే నంబర్ 75 – 2ఏలోని 556 ఎకరాల భూములపై జిల్లా విజిలెన్స్ అధికారులు బుధవారం విచారణ చేపట్టారు. తహసీల్దార్ కార్యాలయంలో గరిమెనపెంటకు సంబంధించిన రెవెన్యూ రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ కార్యాలయంలో జిల్లా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఏఓ ధనుంజయరెడ్డి మాట్లాడారు. గరిమెనపెంటలో సర్వే నంబర్ 75 – 2ఏలో 556 ఎకరాల భూములు ఉన్నాయని, ఈ భూముల్లో కొంత అటవీ భూములుగా రెవెన్యూ రికార్డుల్లో ఉన్నాయని, అయితే కొందరు ఈ భూములను కొనుగోలు చేసినట్లు, పాస్‌పుస్తకాల 1బీ అడంగళ్‌లో పేర్లు నమోదు చేసి ఉన్నారని వివరించారు. అసలు ఈ భూములు ఎవరివి, పేర్లు మార్చి విక్రయించింది ఎవరు, వీరికి సహకరించిన అధికారులెవరు అని ఫిర్యాదులు రావడంతో విజిలెన్స్ ఎస్పీ రమేషయ్య ఆదేశాల మేరకు విచారణ చేపట్టామని తెలిపారు. విచారణ చేసి ఉన్నతాధికారులకు నివేదిక అందిస్తామని తెలిపారు. అనంతరం తహసీల్దార్ నిర్మలానందబాబా మాట్లాడారు. ఈ భూములపై సర్వే నిర్వహించామని, నివేదికను అధికారులకు అందించామని తెలిపారు. రేంజర్ ఉమామహేశ్వరరెడ్డి పాల్గొన్నారు. -
వావిలేటిపాడు భూములపై విచారణ జరిపించండి
కలెక్టర్‌కు సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి వినతి నెల్లూరు(పొగతోట): వావిలేటిపాడులోని సర్వేనంబర్ 272లోని భూములను ఆక్రమించినట్లు తనపై వస్తున్న ఆరోపణలపై పూర్తిస్థాయిలో విచారణ జరిపించాలని కలెక్టర్ ఆర్ ముత్యాలరాజుకు సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. గురువారం కలెక్టరేట్లో కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. భూములకు సంబం«ధించిన పూర్తి వివరాలు కలెక్టర్‌కు అందజేశారు. స్పందించిన కలెక్టర్ భూములపై జేసీతో విచారణ జరిపిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ వావిలేటుపాడులో సర్వేనంబర్ 272/2ఏలో తన కుటుంబ సభ్యుల పేరుతో ఆరెకరాల భూములు ఉన్నాయన్నారు. అందుకు సంబంధించి రెవెన్యూ అధికారులు ఇచ్చిన పత్రాలు ఉన్నాయన్నారు. 272 సర్వే నంబర్‌కు సంబంధించి మీసేవలో ఎఫ్ఎంబీ అడిగితే లేదని, బ్లాక్ అయిందని తెలిపారన్నారు. ఎందుకు బ్లాక్ చేశారో రెవెన్యూ అధికారులే చెప్పాలన్నారు. సర్వే నంబర్‌ను సబ్‌డివిజన్ చేయకుండా, టౌన్‌ప్లాన్ అనుమతి లేకుండా లేఅవుట్లు ఏ విధంగా వేశారని ప్రశ్నించారు. లేఅవుట్లోని భూములు డబుల్ రిజిస్ట్రేషన్లు జరిగాయని, బాధితులు ఎవరి వద్ద కొన్నారో వారినే అడగాలన్నారు. భూఆక్రమణలపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి తప్పు ఎవరు చేస్తే వారిపై అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. 300 కేసులు పెట్టిన భయపడం ఎమ్మెల్సీ సోమిరెడ్డి తనపై 3 కాదు 300 కేసులు పెట్టించిన భయపడేదిలేదని సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి పేర్కొన్నారు. ఎంత మంది సోమిరెడ్లు విచ్చిన తనను ఏమి చేయలేరన్నారు. రాజకీయాల్లో ఉంటూ హుందాగా వ్యవహరిస్తున్నామన్నారు. అవినీతిపై బహిరంగ విచారణకు సిద్దమాని సోమిరెడ్డికి సవాల్ విసిరారు. వైఎస్సార్సీపీ జిల్లా కార్యదర్శి చిల్లకూరు సుధీర్‌రెడ్డి, టీపీ గూడూరు జెడ్పీటీసీ చిరంజీవిగౌడ్, నాయకులు విష్ణువర్ధన్‌రెడ్డి, దశరథరామిరెడ్డి, కోదండరామిరెడ్డి, విజయమోహన్‌రెడ్డి, శ్రీధర్‌నాయుడు, భాస్కర్‌గౌడ్, పొదలకూరు ఎంపీపీ బ్రహ్మయ్య, తదితరులు ఉన్నారు.