వావిలేటిపాడు భూములపై విచారణ జరిపించండి
-
కలెక్టర్‌కు సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి వినతి
నెల్లూరు(పొగతోట): వావిలేటిపాడులోని సర్వేనంబర్ 272లోని భూములను ఆక్రమించినట్లు తనపై వస్తున్న ఆరోపణలపై పూర్తిస్థాయిలో విచారణ జరిపించాలని కలెక్టర్ ఆర్ ముత్యాలరాజుకు సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. గురువారం కలెక్టరేట్‌లో కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. భూములకు సంబం«ధించిన పూర్తి వివరాలు కలెక్టర్‌కు అందజేశారు. స్పందించిన కలెక్టర్ భూములపై జేసీతో విచారణ జరిపిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ వావిలేటుపాడులో సర్వేనంబర్ 272/2ఏలో తన కుటుంబ సభ్యుల పేరుతో ఆరెకరాల భూములు ఉన్నాయన్నారు. అందుకు సంబంధించి రెవెన్యూ అధికారులు ఇచ్చిన పత్రాలు ఉన్నాయన్నారు. 272 సర్వే నంబర్‌కు సంబంధించి మీసేవలో ఎఫ్‌ఎంబీ అడిగితే లేదని, బ్లాక్ అయిందని తెలిపారన్నారు. ఎందుకు బ్లాక్ చేశారో రెవెన్యూ అధికారులే చెప్పాలన్నారు. సర్వే నంబర్‌ను సబ్‌డివిజన్ చేయకుండా, టౌన్‌ప్లాన్ అనుమతి లేకుండా లేఅవుట్లు ఏ విధంగా వేశారని ప్రశ్నించారు. లేఅవుట్‌లోని భూములు డబుల్ రిజిస్ట్రేషన్లు జరిగాయని, బాధితులు ఎవరి వద్ద కొన్నారో వారినే అడగాలన్నారు. భూఆక్రమణలపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి తప్పు ఎవరు చేస్తే వారిపై అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.
300 కేసులు పెట్టిన భయపడం
ఎమ్మెల్సీ సోమిరెడ్డి తనపై 3 కాదు 300 కేసులు పెట్టించిన భయపడేదిలేదని సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి పేర్కొన్నారు. ఎంత మంది సోమిరెడ్లు విచ్చిన తనను ఏమి చేయలేరన్నారు. రాజకీయాల్లో ఉంటూ హుందాగా వ్యవహరిస్తున్నామన్నారు. అవినీతిపై బహిరంగ విచారణకు సిద్దమాని సోమిరెడ్డికి సవాల్ విసిరారు. వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యదర్శి చిల్లకూరు సుధీర్‌రెడ్డి, టీపీ గూడూరు జెడ్పీటీసీ చిరంజీవిగౌడ్, నాయకులు విష్ణువర్ధన్‌రెడ్డి, దశరథరామిరెడ్డి, కోదండరామిరెడ్డి, విజయమోహన్‌రెడ్డి, శ్రీధర్‌నాయుడు, భాస్కర్‌గౌడ్, పొదలకూరు ఎంపీపీ బ్రహ్మయ్య, తదితరులు ఉన్నారు.