న్యూఢిల్లీ: వివాదాస్పద అయోధ్య భూ కేటాయింపు కేసు విచారణలో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ సున్నిత కేసులో కక్షిదారులుగా చేరడానికి సామాజిక కార్యకర్తలు తీస్తా సెతల్వాడ్, శ్యామ్ బెనగల్‌కు సుప్రీంకోర్టు నిరాకరించింది. దీంతో ప్రధాన కక్షిదారులే ఇకపై విచారణలో పాల్గొంటారు. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని బెంచ్ బుధవారం ఆదేశాలు జారీచేసింది.
భూ వివాదానికి సంబంధించిన పిటిషన్లను ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ చేయాలా? లేదా? అన్న అంశంపై తొలుత నిర్ణయం తీసుకుంటామని ధర్మాసనం తెలిపింది. ‘మధ్యంతర జోక్యంపై కక్షిదారుల లాయర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. అలాంటి పిటిషన్లతో ఎలాంటి ప్రయోజనం లేదని భావిస్తూ వాటిని తిరస్కరిస్తున్నాం’ అని బెంచ్ పేర్కొంది. ఇకపై కూడా అలాంటి పిటిషన్లను స్వీకరించొద్దని కోర్టు రిజిస్ట్రీని ఆదేశించింది. హిందూ, ముస్లిం సంస్థలు, వ్యక్తులే కక్షిదారులుగా కొనసాగుతారని స్పష్టం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment