రామాలయం.. 1528 నుంచి నేటి వరకూ.. | Ram Mandir Ayodhya Inauguration History | Sakshi
Sakshi News home page

Ayodhya: రామాలయం.. 1528 నుంచి నేటి వరకూ..

Published Sat, Jan 6 2024 1:58 PM | Last Updated on Sat, Jan 6 2024 2:41 PM

Ram Mandir Ayodhya Inauguration History - Sakshi

అయోధ్యలోని శ్రీరాముని జన్మస్థలంలో నూతన రామమందిరాన్ని నిర్మించారు. శ్రీరాముని విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం 2024, జనవరి 22న జరగనుంది. అత్యంత వైభవంగా జరిగే ఈ కార్యక్రమాన్ని ప్రపంచం మొత్తం వీక్షించనుంది. శ్రీరాముని ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీతో పాటు పలువురు ప్రత్యేక అతిథులు అయోధ్యకు తరలిరానున్నారు. ఈ కార్యక్రమం పూర్తయిన తరువాత సామాన్య భక్తులు కూడా చారిత్రాత్మక రామాలయాన్ని సందర్శించుకోగలుగుతారు. అయితే అయోధ్య రామాలయం నిర్మాణం వెనుకున్న పలు సంఘటనలు ఒకసారి గుర్తు చేసుకుందాం.

అది.. 1528వ సంవత్సరం
బాబ్రీ మసీదును మొఘల్ చక్రవర్తి కమాండర్ మీర్ బాకీ నిర్మించారు. మీర్ బాకీ ఈ మసీదుకు బాబ్రీ అని పేరు పెట్టారు.

1885
అయోధ్య రామజన్మభూమి వ్యవహారం తొలిసారిగా కోర్టుకు చేరింది. బాబ్రీ మసీదు పక్కనే రామ మందిరాన్ని నిర్మించేందుకు అనుమతి ఇవ్వాలని మహంత్ రఘువర్‌దాస్‌ ఫైజాబాద్ కోర్టులో అప్పీల్ దాఖలు చేశారు.

1949
వివాదాస్పద నిర్మాణంలోని మధ్య గోపురం కింద రామ్ లల్లా విగ్రహం కనిపించింది. ఆ తర్వాత స్థానికులు ఆ ప్రదేశంలో పూజలు చేయడం ప్రారంభించారు.

1950
గోపాల్ సింగ్ విశారద్ అనే పండితుడు ఇక్కడ పూజలు చేసే హక్కును డిమాండ్ చేస్తూ ఫైజాబాద్ కోర్టులో కేసు వేశారు. ఈ కేసు నేపధ్యంలో హిందువులు ఆలయంలో పూజించే హక్కును పొందారు. 

1950
పరమహంస రామచంద్ర దాస్‌ ఆ ప్రాంతంలో విగ్రహాలను ఉంచి, పూజించేందుకు అనుమతించాంటూ ఫైజాబాద్‌ కోర్టులో కేసు వేశారు. ఇదే రామ మందిర ఉద్యమానికి నాంది పలికింది.

1959
వివాదాస్పద స్థలాన్ని స్వాధీనం చేసుకునేందుకు నిర్మోహి అఖారా కోర్టు మెట్లు ఎక్కింది. 

1981
యూపీ సున్నీ వక్ఫ్ బోర్డు ఆ ‍ ప్రాంతం స్వాధీనంపై కేసు వేసింది.

1986
ఫిబ్రవరి ఒకటిన హిందువులు పూజించేందుకు ఈ స్థలాన్ని తెరవాలని స్థానిక కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

1989
హైకోర్టు నుంచి కూడా హిందువులకు ఉపశమనం లభించింది. ఆగస్టు 14న ఈ కేసులో యథాతథ స్థితిని కొనసాగించాలని అలహాబాద్ హైకోర్టు ఆదేశించింది.

1992
డిసెంబర్ 6న ఈ వివాదాస్పద కట్టడం కూల్చివేతకు గురయ్యింది. దీంతో రామమందిరం కోసం ఉద్యమం మరింత ఊపందుకుంది.

2002
ఈ వ్యవహారం అలహాబాద్ హైకోర్టుకు చేరింది. వివాదాస్పద స్థలం యాజమాన్య హక్కులపై అలహాబాద్ హైకోర్టు విచారణ ప్రారంభించింది.

2010
అలహాబాద్ హైకోర్టు  సెప్టెంబరు 30న తీర్పు వెలువరించింది. వివాదాస్పద స్థలాన్ని సున్నీ వక్ఫ్ బోర్డు, నిర్మోహి అఖారా, రామ్ లల్లాకు మూడు సమాన భాగాలుగా విభజించాలని హైకోర్టు తీర్పు చెప్పింది.

2011
మే 9న అలహాబాద్ హైకోర్టు ఈ ప్రాంతాన్ని మూడు సమాన భాగాలుగా విభజించాలన్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు నిలిపివేసింది.

2018
ఫిబ్రవరి 8న సివిల్ అప్పీళ్లపై సుప్రీంకోర్టు విచారణ ప్రారంభించింది.

2019
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ నేతృత్వంలో ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటయ్యింది.

2019
ఆగస్టు 6న అయోధ్య కేసుపై సుప్రీంకోర్టులో రోజువారీ విచారణ ప్రారంభమైంది. 2019, ఆగస్టు 16న విచారణ పూర్తయిన తర్వాత ధర్మాసనం నిర్ణయాన్ని రిజర్వ్‌ చేసింది.

2019
నవంబర్ 9న సుప్రీంకోర్టుకు చెందిన ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం శ్రీరామ జన్మభూమికి అనుకూలంగా తీర్పునిచ్చింది. హిందూ పక్షం 2.77 ఎకరాల వివాదాస్పద భూమిని దక్కించుకుంది. మసీదు కోసం ప్రత్యేకంగా ఐదు ఎకరాల స్థలాన్ని ముస్లిం వర్గానికి అందించాలని నాడు సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ తీర్పు తదనంతరం అయోధ్య  రామాలయ నిర్మాణం ప్రారంభమయ్యింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement