
లంచం ఇవ్వకండి..!
ప్రభుత్వ శాఖల్లో పనుల కోసం మరీ వేగవంతంగా పనులు చేయించుకోవాలనే తాపత్రయంలో ప్రజలు అధికారులు, ఉద్యోగులకు లంచాలు ఇస్తున్నారని, ఇది చాలా తప్పని...అందరం కలిసి లంచగొండి తనాన్ని రూపుమాపుతామని జిల్లా ఎస్పీ పీహెచ్‌డీ రామకష్ణ ప్రతిన బూనారు.
కడప : ప్రభుత్వ శాఖల్లో పనుల కోసం మరీ వేగవంతంగా పనులు చేయించుకోవాలనే తాపత్రయంలో ప్రజలు అధికారులు, ఉద్యోగులకు లంచాలు ఇస్తున్నారని, ఇది చాలా తప్పని...అందరం కలిసి లంచగొండి తనాన్ని రూపుమాపుతామని జిల్లా ఎస్పీ పీహెచ్‌డీ రామకష్ణ ప్రతిన బూనారు. శనివారం ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు ప్రధాన కార్యాలయంలో విజిలెన్స్ వారోత్సవాల ముగింపు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రతి ఒక్కరూ లంచం ఎందుకు ఇవ్వాలనే ప్రశ్న వేసుకోవాలన్నారు. మా పోలీసుశాఖలోనే కాకుండా ఇతర ప్రభుత్వ కార్యాలయాల్లో లంచం ఇచ్చే పద్దతికి స్వస్తి పలకాలని ఆయన కోరారు. లంచం ఇవ్వడం, తీసుకోవడం నేరమనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించుకుంటే ఎంతో పరివర్తన సాధించినట్లేనన్నారు. పనుల కోసం లంచాలను ప్రజలే అలవాటు చేశారన్నారు. లంచం ఇస్తే పని జరిగేది? లేకపోతే లేదు అనే అపోహా వీడాలని పిలుపునిచ్చారు. లంచం ఇవ్వకపోతే అధికారిగానీ, ఉద్యోగిగానీ ఆ పని ఎందుకు చేయడో వేచి చూసి నిలదీస్తే సరిపోతుందన్నారు. పనులు జరగకపోతే కిందిస్థాయి నుంచి పై స్థాయి అధికారికి ఫిర్యాదు చేసి పరిష్కరించుకోవడానికి అవకాశముందన్నారు. ప్రజాస్వామ్యంలో అధికారులుగానీ, ఉద్యోగులుగానీ తమ కర్తవ్యాన్ని తాము నిర్వర్తించినపుడే దానికి సార్థకత ఉంటుందన్నారు ఏపీజీబీ చైర్మన్ సంపత్‌కుమారాచారి మాట్లాడుతూ తమ బ్యాంకు శాఖల్లో కూడా అవినీతి లేకుండా చేస్తున్నామన్నారు. ప్రతి ఖాతాదారునికే కాకుండా ఇతరులు కూడా బ్యాంకుకు వచ్చినపుడు వారి సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు కషి చేస్తున్నామన్నారు. ఆర్‌ఎం రాజశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ దేశంలోని గ్రామీణ బ్యాంకింగ్ రంగంలో సేవలు అందించడంలో ఏపీజీబీ 78వ ర్యాంకులోఉందన్నారు. పూర్తి నెట్‌వర్క్ వ్యవస్థ కలిగి ఉన్నది ఏపీజీబీయేనని ఆయన అన్నారు. అనంతరం పలు అంశాలపై పాఠశాల విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన, వక్తత్వపోటీల్లో విజేతలైన నవ్య, సాయిలయ, నఫీజ, మోహన్‌కష్ణలకు ఎస్పీ బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో బ్యాంకు సీనియర్ మేనేజర్లు కష్ణామాచారి, శైలేంద్రనాథ్, వివేకానంద, రఘురామిరెడ్డితోపాటు విద్యార్థులు, బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు.