'న్యాయమూర్తుల ఫోన్లూ వదలడం లేదు' | There is a dirty tricks govt in topmost level: Congress | Sakshi
Sakshi News home page

'న్యాయమూర్తుల ఫోన్లూ వదలడం లేదు'

Published Thu, Jun 16 2016 2:42 PM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

'న్యాయమూర్తుల ఫోన్లూ వదలడం లేదు' - Sakshi

'న్యాయమూర్తుల ఫోన్లూ వదలడం లేదు'

కాంగ్రెస్ పార్టీ మరోసారి బీజేపీపై విమర్శల దాడికి దిగింది. బీజేపీ చెత్త రాజకీయాలు చేస్తోందని మాజీ కేంద్రమంత్రి ఆనంద్‌ శర్మ అన్నారు.

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ మరోసారి బీజేపీపై విమర్శల దాడికి దిగింది. బీజేపీ చెత్త రాజకీయాలు చేస్తోందని మాజీ కేంద్రమంత్రి ఆనంద్‌ శర్మ అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రధాని స్థాయిలో నీచమైన కుట్రలు జరుగుతున్నాయన్నారు. దేశంలో చిన్న అధికారి నుంచి పెద్ద స్థాయి అధికారుల వరకు అందరిపై నిఘా ఉంచారని, వారి ఫోన్లు ట్యాపింగ్లు చేస్తున్నారని అన్నారు.

ఆఖరికి దేశ న్యాయమూర్తుల ఫోన్లు కూడా విడిచి పెట్టడం లేదని, వారి ఫోన్లను కూడా ట్యాప్ చేస్తున్నారని చెప్పారు. జర్నలిస్టులు, పారిశ్రామిక వేత్తలు కూడా నిఘా కిందే ఉన్నారని చెప్పారు. స్వయంగా ప్రధానమంత్రి కార్యాలయం నుంచి ఇలాంటి కార్యక్రమాలు జరుగుతుండటం విస్మయకరం అని ఆరోపించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement