
సీవీసీ చెడ్డ పదమేమీకాదు: కేవీ చౌదరి
న్యూఢిల్లీ: సెంట్రల్ విజిలెన్స్ పదం పట్ల చాలాకాలంగా ప్రజలు ఒకరకమైన భావనను కలిగి ఉన్నారని, కానీ, అదేమీ చెడ్డ పదం కాదని సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్(సీవీసీ) కేవీ చౌదరి అన్నారు. గురువారం ఇక్కడ జరిగిన అంతర్జాతీయ మానవ హక్కుల సెమినార్‌లో ఆయన మాట్లాడారు. అక్రమాలకు దూరంగా ప్రతి సంస్థ ప్రణాళికాబద్ధంగా, ప్రమాణాల ప్రకారం నడుచుకోవాలని సూచించారు. మంచి, చెడుల పట్ల జాగ్రత్తగా ఉండాలని, ఎవరైనా అవినీతికి పాల్పడితే పట్టించాలని కోరారు.