కడప అగ్రికల్చర్ : జిల్లాలో అక్రమంగా విద్యుత్ వినియోగిస్తున్న వారిపై కేసులు నమోదు చేసినట్లు దక్షిణ మండల విద్యుత్ విజిలెన్స్ సంస్థ ఎస్‌ఇ రవి తెలిపారు. బుధవారం రాత్రి కడప నగరంలోని శంకరాపురంలో ఉన్న విద్యుత్‌శాఖ అతి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఏపీఎస్‌పీడీసీఎల్ పరిధిలోని ఎనిమిది జిల్లాల నుంచి వచ్చిన అధికారులు, సిబ్బంది నాలుగు గ్రూపులుగా విడిపోయి మైదుకూరు, లింగాల, వీరపునాయునిపల్లె, చిట్వేలు మండలాల్లో అక్రమంగా విద్యుత్ వినియోగిస్తున్న ఇళ్లపై దాడులు నిర్వహించామన్నారు. ఈ నాలుగు మండలాల్లో మీటర్ల వద్ద వైర్లను తప్పించి విద్యుత్‌ను వాడుతున్న 115 మందిపైన, బజారులోని వైర్లకు కొక్కెలు తగిలించి కరెంటును వినియోగిస్తున్న 25 మందిపైన, మీటరు ఒక కేటగిరిలో తీసుకుని, మరో కేటగిరిలో కరెంటును వాడుతున్న 15 మందిపై, అదనపు లోడ్‌ను వాడుతున్న 82 మంది మీద, బ్యాక్ బిల్లింగ్‌లో ముగ్గరిపైన మొత్తం 240 మందిపైన కేసులు నమోదు చేశామన్నారు. అలాగే అపరాధ రుసుం రూ.22.36 లక్షలు విధించామన్నారు. ఇప్పటికైనా అక్రమంగా విద్యుత్ వాడుతున్న వారు రూ. 125 స్కీము కింద దరఖాస్తు చేసుకుని కనెక్షన్లు పొందాలని కోరుతున్నామన్నారు. ఈ సమావేశంలో చీప్ వి జిలెన్స్ ఆఫీసర్ మనోహర్, ఎస్‌ఈ సుబ్బరాజు, కడప విజిలెన్స్ సీఐ గౌతమి, విద్యుత్ భవన్ టెక్నికల్ ఏఈ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.
విద్యుత్ చోరులపై కేసులు
Published Thu, Jan 26 2017 1:14 AM | Last Updated on Tue, Sep 5 2017 2:06 AM
Advertisement
Advertisement