అవసరమైతే విజిలెన్స్ విచారణ జరిపిస్తాం
అవసరమైతే విజిలెన్స్ విచారణ జరిపిస్తాం
Published Sat, Oct 1 2016 8:42 PM | Last Updated on Mon, Sep 4 2017 3:48 PM
చౌటుప్పల్ : చౌటుప్పల్ మండలంలో మిషన్ కాకతీయ పనుల్లో జరిగిన అవినీతి, అక్రమాలపై అవసరమైతే విజిలెన్స్ విచారణ జరిపిస్తామని ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ అన్నారు. చౌటుప్పల్ మండల పరిషత్ సర్వసభ్య సమావేశం శనివారం ఎంపీపీ చిలుకూరి ప్రభాకర్‌రెడ్డి అధ్యక్షతన జరిగింది. మిషన్ కాకతీయ పనులు సరిగా జరగలేదని, తక్కువ పనిచేసి, ఎక్కువ బిల్లులు తీసుకున్నారని సభ్యులు ఆందోళన చేశారు. దీంతో ఎమ్మెల్సీ ప్రభాకర్ స్పందించి మాట్లాడుతూ అవకతవకలపై విచారణ చేయమని రాష్ట్ర విజిలెన్స్‌కు లేఖ రాస్తానన్నారు. మండలంలోని వివిధ పరిశ్రమల్లో స్థానికులకు ఉద్యోగాలివ్వాలని డిమాండ్ చేస్తూ చేపట్టే ఒక రోజు దీక్షలో తాను కూడా పాల్గొంటానన్నారు. మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ చౌటుప్పల్ పట్టణాన్ని దీన్‌దయాళ్ పథకానికి ప్రభుత్వం ఎంపిక చేసిందన్నారు. రూ.7కోట్లు నిధులు మంజూరవుతాయన్నారు. పలు సమస్యలు, డిమాండ్లను సింగిల్‌విం డో చైర్మన్ చీరిక సంజీవరెడ్డి, సర్పంచ్ సుర్వి మల్లేష్‌గౌడ్, ఆరెగూడెం ఎంపీటీసీ సభ్యుడు బద్దం అంజయ్య తదితరులు సభదృష్టికి తీసుకొచ్చారు. అనంతరం అమర జవాన్ల మృతికి సంతాప సూచకంగా మౌనం పాటించారు. ఈ సమావేశంలో జెడ్పీటీసీ పెద్దిటి బుచ్చిరెడ్డి, ఎంపీడీఓ రజిత, వైస్ ఎంపీపీ కాయితీ రమేష్‌గౌడ్, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, అధికారులు పాల్గొన్నారు.
Advertisement