కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో ఓ వ్యక్తి కత్తితో వీరంగం సృష్టించాడు.
ఆధోని : కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో ఓ వ్యక్తి కత్తితో వీరంగం సృష్టించాడు. వీధిలో పోయే వాళ్లందరినీ కత్తితో పొడుస్తానని బెదిరింపులకు దిగాడు. స్థానికులు భయపడి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు డాక్టర్ల సహాయంతో మత్తుమందు ఇచ్చి అతనిని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసుల విచారణలో తాను వైఎస్సార్ జిల్లా కడప నగరానికి చెందిన వాడినని, తన పేరు బాలకృష్ణ అని చెప్పినట్లు తెలిసింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.